ఈ చట్టం ప్రకారం బాల్య వివాహాలు చేయడం పూర్తిగా నిషేధం. ఈ చట్టం ప్రకారం వివాహ వయసు పురుషునికి 21, సీ్త్రలకు 18 ఏళ్లు నిండి ఉండాలి. మైనర్‌లను వివాహం చేసుకుంటే రూ.లక్ష జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష, రెండూ విధించేందుకు అవకాశం ఉంటుంది. బాల్య వివాహాలను ఎవరైనా ప్రోత్సహించినా, కుదిర్చినా, చేయించినా తల్లిదండ్రులు, సంరక్షకులు శిక్షార్హులే. జిల్లా ప్రధాన న్యాయాధికారి ఈ చట్ట పరిధిలో కేసులను విచారణ చేస్తారు. బాల్య వివాహాన్ని ఎవరైనా జరిపిస్తున్నట్లు సమాచారం అందితే.. ఆ వివాహాన్ని నిరోధిస్తూ నిషేధాజ్ఞలు జారీ చేసే అవకాశం జిల్లా జడ్జికి ఉంటుంది.


