సంస్థాన్ నారాయణపురం: మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ ఆశయాలు నేటికీ ఆదర్శమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమం కోసం ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ నినాదాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు ఆమె స్ఫూర్తితోనే ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన దిశగా పనిచేస్తున్నాయని కొనియాడారు. దేశం కోసం ఇందిరాగాంధీ కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి


