ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు

Nov 20 2026 7:33 AM | Updated on Nov 20 2026 7:33 AM

బొమ్మలరామారం: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తక్కువ నీటితో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని, ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. బొమ్మరామారం మండలంలోని చీకటిమామిడిలో నాబార్డ్‌, గ్రామీణ మహిళా మండలి సహకారంతో ధీశాలి ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో ఖేతి ఎంటర్‌ప్రైజెస్‌ నిర్మించిన షేడ్‌నెట్‌ హౌస్‌ను ఆయన సందర్శించారు. కూరగాయలు సాగు చేస్తున్న మహిళా రైతు సుజాతతో మాట్లాడి పెట్టుబడి, ఆదాయం వివరాలు తెలుసుకున్నారు. ఎంఐడీహెచ్‌ పథకం కింద మధిర మణమ్మ నిర్మించుకున్న నీటి కుంట, రైతు గోలిపల్లి సుధాకర్‌రెడ్డిడ్రిప్‌తో సాగు చేస్తున్న బెండ తోటను పరిశీలించారు. గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల నమోదును పరిశీలించి అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ నాగిరెడ్డి, ఉద్యాన అధికారి హేమలత, డీఏఓ వెంకటరమణారెడ్డి, తహసీల్దార్‌ రాధ, ఎంపీడీఓ శ్యామల, సర్పంచ్‌ తిర్మణి నాగరాజు గౌడ్‌ పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement