మైనారిటీ అభ్యర్థులకు గ్రూప్‌–2, 3 ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

మైనారిటీ అభ్యర్థులకు గ్రూప్‌–2, 3 ఉచిత శిక్షణ

Nov 20 2026 7:33 AM | Updated on Nov 20 2026 7:33 AM

భువనగిరిటౌన్‌ : గ్రూప్‌–2, గ్రూప్‌–3 పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్‌ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఉచిత బేసిక్‌ ఫౌండేషన్‌ శిక్షణ అందించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జయమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన ముస్లిం, క్రై స్తవ, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ మైనారిటీ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 26వ తేదీలోపు హైదరాబాద్‌లోని ఇంటర్మీడియట్‌ బోర్డు వెనుక ఉన్న ఇందిరా ప్రియదర్శిని డిగ్రీ కళాశాల భవన సముదాయం (ఎంఏఎం క్యాంపస్‌)లోగల స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు రాయగిరిలోని కలెక్టరేట్‌ మొదటి అంతస్తు, రూమ్‌ నంబర్‌ ఎఫ్‌–16లోని జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయంలో సంప్రదించాలని ఆమె కోరారు.

మహిళా హక్కులపై

అవగాహన అవసరం

భువనగిరి : విద్యార్థినులు మహిళా సాధికారత, హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవీలత అన్నారు. గురువారం భువనగిరి పట్టణంలోని బాలికల పోస్ట్‌ మెట్రిక్‌ సంక్షేమ హాస్టల్‌లో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థినులకు పలు న్యాయపరమైన అంశాలపై సూచనలు చేశారు. అనంతరం బాలసదన్‌ను సందర్శించి, అక్కడి నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారిణి లక్ష్మి, న్యాయ సహాయక న్యాయవాది సరిత పాల్గొన్నారు.

మత్స్యగిరి ఆలయ

బ్రహ్మోత్సవాలు ప్రారంభం

వలిగొండ : వలిగొండ మండలం వెంకటాపురంలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం, ఉత్సవానుజ్ఞ ప్రార్థన, స్వస్తివాచనం, శ్రీ విష్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, రక్షా సూత్ర ధారణ, యాగశాల ద్వారతోరణ పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణం, గరుడధ్వజాధివాసం, హవిర్నివేదనం, శాత్తుమొర, తీర్థప్రసాద గోష్ఠి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ తుమ్మల శ్రీనివాస్‌, ఆలయ కార్యనిర్వహణాధికారి కొత్తపల్లి వెంకటయ్య, ధర్మకర్త నరేందర్‌ రెడ్డి, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

పీజీఐ ర్యాంకింగ్‌లో

అగ్రస్థానంలో నిలపాలి

భువనగిరి: పెర్ఫార్మెన్స్‌ గ్రేడ్‌ ఇండెక్స్‌ (పీజీఐ) ర్యాంకింగ్‌లో జిల్లాను ఉన్నత స్థాయిలో నిలపాలని డీఈఓ భిక్షపతి కోరారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎంఈఓలు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు, సీఆర్‌పీలు, ఎంఐఎస్‌ కో–ఆర్డినేటర్లకు నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి పాఠశాలలో ఉన్న వసతులు, సౌకర్యాలను యూ–డైస్‌ లో తప్పనిసరిగా పొందుపరిచినప్పుడే పీజీఐ ర్యాంకు మెరుగుపడుతుందన్నారు. అనంతరం ఎఫ్‌ఎల్‌ఎన్‌ , ప్రశస్త్‌, హరిత విద్యాలయ రేటింగ్‌పై అవగాహన కల్పించారు. సమావేశంలో జిల్లా కో–ఆర్డినేటర్లు శ్రీహరి అయ్యంగార్‌, పెసరు లింగారెడ్డి, జానీ అఫ్గాన్‌, నరహరి, గెజిటెడ్‌ హెచ్‌ఎంల సంఘం అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, ఎంఈఓ రంగరాజన్‌, జిల్లా సైన్స్‌ అధికారి రాజశేఖర్‌, ఎఫ్‌ఎల్‌ఎన్‌ టీమ్‌ సభ్యులు వెంకన్న, సైదారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement