ఫ్రీజర్ల కొరత.. నేలపైనే మృతదేహాలు | - | Sakshi
Sakshi News home page

ఫ్రీజర్ల కొరత.. నేలపైనే మృతదేహాలు

Nov 20 2026 7:33 AM | Updated on Nov 20 2026 7:33 AM

ఫ్రీజర్ల సంఖ్య పెంచుతాం

ఒకటి కంటే ఎక్కువ వస్తే..

భువనగిరి: భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి మార్చురీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మృతదేహాలకు కనీస భద్రత కరువవడంతో పాటు, తీవ్ర దుర్వాసన వస్తోంది. మార్చురీలో సరిపడా ఫ్రీజర్లు లేకపోవడంతో మృతదేహాలను గదిలోని ఖాళీ ప్రదేశంలో నేలపైనే ఉంచుతున్నారు. ఆసుపత్రి స్థాయి పెరిగినా మార్చురీ గదిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా భువనగిరిలో ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య.. మార్చురీ దుస్థితిని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం, నిర్వహణ లోపాలపై మండిపడి, సిబ్బందికి నోటీసులు జారీ చేసేలా ఆదేశాలు ఇచ్చారు.

భవనం సరిపోక..

భువనగిరిలో ఏరియా ఆసుపత్రి ఉన్న కాలంలో ఈ మార్చురీని నిర్మించారు. ఆ తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా ఇది జిల్లా కేంద్ర ఆసుపత్రిగా మారింది. 2024లో భువనగిరికి ప్రభుత్వ మెడికల్‌ కళాశాల మంజూరు కావడంతోఆసుపత్రి డీఎంఈ పరిధిలోకి వెళ్లి 220 పడకల సామర్థ్యంతో జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ అయింది. ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నా మార్చురీని పట్టించుకోకపోవడంతో ప్రస్తుత వస్తున్న మృతదేహాల రద్దీకి ఆ భవనం సరిపోవడం లేదు.

నెలకు 80కిపైగా మృతదేహాలు

భువనగిరి జిల్లా మీదుగా హైదరాబాద్‌–వరంగల్‌, హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారులతోపాటు సికింద్రాబాద్‌–కాజీపేట, సికింద్రాబాద్‌–రేపల్లె రైలు మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో రోడ్డు, రైలు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. వీటితోపాటు ఆత్మహత్యలు, ఇతర కారణాలతో మృతి చెందిన వారి శవాలను పోస్టుమార్టం నిమిత్తం ఇక్కడికే తీసుకొస్తారు. సగటున నెలకు 55 నుంచి 80 వరకు మృతదేహాలు వస్తుంటాయి. గుర్తించిన మృతదేహాలకు అదేరోజు లేదా మరుసటి రోజు పోస్టుమార్టం చేసి అప్పగిస్తారు. కానీ, గుర్తు తెలియనివాటిని మూడు రోజుల వరకు మార్చురీలోనే భద్రపరచాల్సి ఉంటుంది.

శానిటేషన్‌ సిబ్బందితోనే మార్చురీ పనులు

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిగా మారినప్పటికీ, మార్చురీకి అవసరమైన ప్రత్యేక సిబ్బందిని మాత్రం నియమించలేదు. మొదటి నుంచి ఆసుపత్రిలో పనిచేస్తున్న సాధారణ పారిశుద్ధ్య కార్మికులతోనే మార్చురీ పనులు చేయిస్తున్నారు.

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఆవరణలోని మార్చురీ భవనం

మార్చురీలో ఉన్న ఒక్కటే ఫ్రీజర్‌

ఫ భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ నిర్వహణ అస్తవ్యస్తం

ఫ ఏళ్లతరబడి పాత భవనంలోనేకొనసాగింపు

ఫ మెడికల్‌ కాలేజీ వచ్చినా మారని

పరిస్థితులు

ఫ ఒక్కటే ఫ్రీజర్‌తో ఇబ్బందులు

మార్చురీలో ఒక్కటే ఫ్రీజర్‌ ఉంది. ఒకటి కంటే ఎక్కువ మృతదేహాలు వచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతోంది. ఉన్నత అధికారులను సంప్రదించి ఆసుపత్రి జనరల్‌ ఫండ్‌ నుంచి దాతల సహకారం మార్చురీని అభివృద్ధి చేయడంతో పాటు ఫ్రీజర్ల సంఖ్చ పెంచేందుకు చర్యలు తీసుకుంటాం.

– లక్ష్మణ్‌, ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌

ప్రస్తుతం ఆసుపత్రి మార్చురీలో ఒకటే ఫ్రీజర్‌ అందుబాటులో ఉంది. మరొకటి చెడిపోయి మూలనపడింది. సాధారణంగా మృతదేహాలు కుళ్లిపోకుండా, దుర్వాసన రాకుండా ఫ్రీజర్‌లో ఉంచుతారు. ఒకే ఫ్రీజర్‌ ఉండటంతో కేవలం ఒక్క మృతదేహాన్ని మాత్రమే భద్రపరచడానికి వీలవుతోంది. ఒకే రోజు రెండు లేదా అంతకంటే ఎక్కువ మృతదేహాలు వచ్చినప్పుడు వాటిని మార్చురీ గదిలో నేలపైనే ఉంచుతున్నారు. దీనివల్ల మృతదేహాల నుంచి కారుతున్న రక్తం, వెదజల్లుతున్న దుర్వాసనతో మృతుల బంధువులు నరకయాతన అనుభవిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement