ప్లాట్లు గాయబ్‌! | - | Sakshi
Sakshi News home page

ప్లాట్లు గాయబ్‌!

Nov 20 2026 7:33 AM | Updated on Nov 20 2026 7:33 AM

సాక్షి, యాదాద్రి: జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలిసిన వెంచర్లు ఇప్పుడు అడ్రస్‌ లేకుండా పోతున్నాయి. ఆరు మున్సిపాలిటీలు, 17 మండలాల్లో విస్తరించిన లేఅవుట్లు క్రమంగా తిరిగి వ్యవసాయ భూములుగా మారుతున్నాయి. కొనుగోలు చేసిన వారి పేరిట రిజిస్ట్రేషన్‌ అయిన వందలాది ప్లాట్లు డాక్యుమెంట్లలో మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప, భూమిపై ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. 2009 నుంచి 2022 వరకు వెలిసిన ఈ వెంచర్లలో హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వారు పెద్ద ఎత్తున ఓపెన్‌ ప్లాట్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం తమ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియక వేలాది మంది కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు.

మాయమాటలతో 1,000కి పైగా వెంచర్లు..

జిల్లా వ్యాప్తంగా 1,000కి పైగానే వెంచర్లు వెలిశాయి. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి, పరిశ్రమలు, జాతీయ రహదారులు, బీబీనగర్‌ ఎయిమ్స్‌ వంటి ప్రాజెక్టులను బ్రోచర్లలో ఆకర్షణీయంగా ముద్రించి రియల్టర్లు ప్లాట్లను విక్రయించారు. అప్పట్లో కొనుగోలుదారులకు మాయమాటలు చెప్పి ప్లాట్లు అంటగట్టిన మార్కెటింగ్‌ సిబ్బంది ఇప్పుడు కనుమరుగయ్యారు. వారంతా తమ సెల్‌ నంబర్లు మార్చేయగా, రియల్టర్లు కార్యాలయాలకు తాళాలు వేసి (బోర్డులు తిప్పేసి) అడ్రస్‌లు మార్చేశారు.

ఫిర్యాదులపై పట్టింపేదీ?

జిల్లాలో తమ ప్లాట్లు కనిపించకుండా పోయాయని బాధితులు పోలీసు, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ప్రజావాణితో పాటు పోలీస్‌ స్టేషన్లలో పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఎక్కడా బాధితులకు న్యాయం జరగడం లేదు. కొన్ని చోట్ల సెటిల్‌మెంట్లకు అధికారులే సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రుస్తాపురం, యాదగిరిగుట్ట, ఆలేరు, చౌటుప్పల్‌, బీబీనగర్‌, భువనగిరి, రాజాపేట తదితర ప్రాంతాల్లో బాధితుల ఫిర్యాదులు బుట్ట దాఖలయ్యాయి.

నష్టపోతున్న కొనుగోలుదారులు

జిల్లా అంతటా వెంచర్ల ఛాయలు లేకుండా చేసే కుట్ర జరుగుతోంది. కొందరు రైతులు, బ్రోకర్లు, రియల్టర్లు కుమ్మకై ్క జేసీబీలతో వెంచర్ల హద్దురాళ్లు, ప్రచార బోర్డులను తొలగిస్తున్నారు. ఆ భూములను చదును చేసి తిరిగి వ్యవసాయ భూములుగా మార్చేస్తున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో ఎక్కువ మంది స్థానికేతరులు కావడంతో, తమ భూములు కబ్జాకు గురవుతున్న విషయాన్ని గుర్తించలేక తీవ్రంగా నష్టపోతున్నారు. అక్రమ వెంచర్లే కాకుండా.. హెచ్‌ఎండీఏ, వైటీడీఏ , డీటీసీపీ పరిధిలో ఉన్న కొన్ని లేఅవుట్లు కూడా ఇదే తరహాలో కనుమరుగవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

భువనగిరి మున్సిపాలిటీ శివారులోని ఓ గ్రామ పంచాయతీలో హైవే–163 పక్కన వెంచర్‌ ఏర్పాటు చేశారు. రైతు వద్ద భూమిని కొనుగోలు చేసి, ప్లాట్లుగా మార్చి విక్రయానికి పెట్టారు. అందులో కొంత భాగానికి నాలా అనుమతి తీసుకుని ప్లాట్ల అమ్మకాలు జరిపారు. ఒప్పందం ప్రకారం భూమికి డబ్బులు చెల్లించలేదని రైతు ఆ వెంచర్‌ను చదును చేశాడు. లేఅవుట్‌లో వేసిన బీటీ రోడ్లను తవ్వి, మొక్కలు తొలగించి వ్యవసాయ భూమిగా మారుస్తున్నాడు. దీంతో వారిద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారి స్థలాలు కేవలం రిజిస్ట్రేషన్‌ కాగితాలకే పరిమితమయ్యాయి.

ఆనవాళ్లు కోల్పోతున్న వెంచర్లు

ఫ ఆరు మున్సిపాలిటీలు, 17

మండలాల్లో 1,000కి పైగా

వెలసిన వెంచర్లు

ఫ హద్దురాళ్లు తొలగించి.. తిరిగి వ్యవసాయ భూములుగా మార్పు

ఫ బోర్డులు తిప్పేసిన రియల్టర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement