ప్రత్యామ్నాయ పంటల సాగు అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటల సాగు అభినందనీయం

Nov 20 2026 7:33 AM | Updated on Nov 20 2026 7:33 AM

ప్రత్యామ్నాయ పంటల సాగు అభినందనీయం

యాదగిరిగుట్ట రూరల్‌: యువ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆసక్తి చూపడం అభినందనీయమని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. తుర్కపల్లి మండలం వేలుపల్లిలో రైతు గుడిపాటి మాలతీరెడ్డి సాగు చేస్తున్న మునగ తోటను ఆయన పరిశీలించారు. సాగు విధానం, పెట్టుబడి, ఖర్చులు, రైతులకు కలుగుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వెంకటరమణారెడ్డి, గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, ఏఓ ఉమ, ఏఈఓ ఉమారాణి, యువ రైతులు అమరేందర్‌ రెడ్డి, వినయ్‌, ప్రవీణ్‌, వకీల్‌, సుధీర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement