విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన

Oct 1 2026 9:39 AM | Updated on Oct 1 2026 9:39 AM

పెన్‌పహాడ్‌ : సమగ్ర విద్యకు ప్రాధాన్యత ఇస్తూ, విభిన్న అభ్యసన అవసరాలు ఉన్న విద్యార్థులకు తగిన సహకారం అందిస్తున్నారు. జపాన్‌లో గణిత బోధనలో విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా విభిన్న సమూహాలను ఏర్పాటు చేసి బోధించడం, తరగతి సమావేశాలు, బృంద కార్యకలాపాల ద్వారా సహకారం, నిర్ణయాలు తీసుకోవడం, ఇతరులను అర్థం చేసుకోవడం వంటి నైపుణ్యాలను పెంపొందించడం గమనించదగిన అంశాలు. కిండర్‌ గార్డెన్‌లో ఆటలు, ప్రకృతి పరిశీలన, తోట పని, సంగీతం, కథలు, సృజనాత్మకత కార్యకలాపాల ద్వారా పిల్లలకు అనుభవవాత్మక విద్యను అందిస్తున్నారు. పిల్లల్లో స్వతంత్ర సామాజిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. విద్యార్థులే స్వయంగా తమ తోటి విద్యార్థులకు క్రమశిక్షణతో ఆహారాన్ని వడ్డించడం నేర్చుకుంటారు. తరగతి గదులు, కారిడార్లు, పాఠశాల ప్రాంగణాన్ని విద్యార్థులే క్రమం తప్పకుండా శుభ్రం చేస్తారు. బాధ్యత, క్రమశిక్షణ, సహకారం, సమయపాలన, సహకారం వంటి విలువలను పెంపొందించడానికి అక్కడి పాఠశాలల్లో ప్రత్యేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. – మారం పవిత్ర, ఉపాధ్యాయురాలు, జెడ్పీహెచ్‌ఎస్‌ పెన్‌పహాడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement