నేటి నుంచి లతీఫ్‌ ఉల్లా ఖాద్రీ ఉర్సు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి లతీఫ్‌ ఉల్లా ఖాద్రీ ఉర్సు

Oct 1 2026 9:39 AM | Updated on Oct 1 2026 9:39 AM

రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పట్టణంలోని హజ్రత్‌ సయ్యద్‌ షా లతీఫ్‌ ఉల్లా ఖాద్రీ ఉర్సు గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉర్సు పరిసర ప్రాంతాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. వ్యాపారులు మిఠాయిలు, బొమ్మల దుకాణాలను నెలకొల్పారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ మరియు స్థానిక యంత్రాంగం చర్యలు చేపట్టారు.

● మొదటి రోజు గురువారం సాయంత్రం 5:30 గంటలకు మదీనా మసీదు ప్రాంగణం నుంచి గంధం ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దర్గా ప్రాంగణంలో ప్రత్యేక దురూద్‌ మరియు నాత్‌ షరీఫ్‌ కార్యక్రమం ఉంటుంది. రాత్రి మతపెద్దలు సయ్యద్‌ సమేతుల్లా ఖాద్రీ, సయ్యద్‌ గౌస్‌ ఉల్లా ఖాద్రీ, సయ్యద్‌ సల్మాన్‌ ఖాద్రీలచే ధార్మిక ప్రసంగాలు ఉంటాయి.

● రెండో రోజు శుక్రవారం మసీదు అవ్వల్‌ తాలుక్దారీ వద్ద సయ్యద్‌ ముహమ్మద్‌ మసీహుద్దీన్‌ గారి అధ్యక్షతన జలాలుద్దీన్‌ సిరాత్‌–ఉన్‌–నబి సీరత్‌ ఏ ఔలియా మహ్ఫిల్‌ నిర్వహిస్తారు. పవిత్ర ఖురాన్‌ పఠనం, ఫాతెహా ప్రార్థనలు మరియు తబర్రుక్‌ (ప్రసాదం) పంపిణీ జరుగుతుంది. తర్వాత దర్గా షరీఫ్‌లో చిరాగాన్‌ (దివ్య దీపాలంకరణ) మహోత్సవం సాగుతుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు దర్గా మెట్ల వద్ద షబ్‌ ఏ హషిమ్‌ పత్యేక సభ మరియు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఉంటాయి.

● మూడో రోజు శనివారం రాత్రి దర్గా షరీఫ్‌ ప్రాంగణంలోని మెట్ల వద్ద ప్రత్యేక మహెఫిలే కవ్వాలి కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఆధ్యాత్మిక కవ్వాల్‌ సయ్యద్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ ఖాద్రీ బృందం తమ సుమధుర కవ్వాలీలతో అలరించనున్నారు.

మూడు రోజుల పాటు ఉత్సవాలు

మదీనా మసీదు ప్రాంగణం నుంచి

గంధం ఊరేగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement