పాతికేళ్లు ముందున్నారు | - | Sakshi
Sakshi News home page

పాతికేళ్లు ముందున్నారు

Oct 1 2026 9:39 AM | Updated on Oct 1 2026 9:39 AM

నడిగూడెం : జపాన్‌ పాఠశాలల్లో చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యత, సామాజిక విలువలు, సమయపాలనకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం బాగుంది. మన విద్యా వ్యవస్థ కంటే జపాన్‌ విద్యా వ్యవస్థ 25 ఏళ్లు ముందుంది. విద్యా వ్యవస్థలో మనం 2026లో ఉంటే, ఆ దేశంలోని విద్య 2050 నాటి స్థాయిలో పురోగతిలో ఉంది. అక్కడి ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు బోధన అంతా మాతృభాషలోనే సాగుతుంది. ఉన్నత హోదాల్లో, పెద్ద స్థాయిలో ఉన్నవారు సైతం ఇంగ్లిష్‌ మాట్లాడేందుకు ఆసక్తి చూపరు. ప్రపంచంలోనే ఉత్తమమైన జపాన్‌ విద్యా విధానాలను, అక్కడ అధ్యయనం చేసిన పలు అంశాలను మన తెలంగాణలోనూ అమలు చేయడానికి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

– తాళ్లూరి సాయిఈశ్వరి, ప్రిన్సిపాల్‌, కరివిరాల మోడల్‌ స్కూల్‌, నడిగూడెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement