సాంకేతిక విద్య భేష్‌.. | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక విద్య భేష్‌..

Oct 1 2026 9:39 AM | Updated on Oct 1 2026 9:39 AM

జపాన్‌లో
మాతృభాషలోనే ఉన్నతవిద్య

మన రాష్ట్ర విద్యార్థులను ఉన్నతంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానాలు

అమలుచేస్తున్న దేశాల్లోని పాఠశాలలను అధ్యయనం

చేసేందుకు ఉపాధ్యాయుల బృందాలను రాష్ట్ర ప్రభుత్వం

అక్కడికి పంపించింది. ఇటీవల ఒక బృందం జపాన్‌, మరొక

బృందం సింగపూర్‌ దేశాల్లో పర్యటించారు. ఆయా దేశాలకు వెళ్లిన అధ్యయన బృందంలో ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు.. అక్కడ పరిశీలించిన విద్యా విశేషాలను సాక్షితో పంచుకున్నారు.

అక్కడి విద్యా విధానాలపై

అధ్యయన బృందం మనోగతం

పెద్దవూర : జపాన్‌లో కిండర్‌ గార్డెన్‌ నుంచి ఉన్నత విద్య (పీహెచ్‌డీ) వరకు బోధన అంతా వారి మాతృభాషలోనే సాగుతుంది. దీని వలన విద్యార్థులు ఏ విషయాన్నైనా సులభంగా అర్థం చేసుకుంటున్నారు. అక్కడి యువత తమ దేశంలోనే ఉంటూ జపాన్‌ అభివృద్ధికి ఉపయోగపడుతున్నారు. జపాన్‌ విద్యా విధానంలో కిండర్‌ గార్డెన్‌, ప్రాథమిక పాఠశాలల స్థాయిలో పుస్తక చదువుల కన్నా విలువలు, క్రమశిక్షణ, సమయపాలన, పరిశుభ్రతలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. చివరికి కిండర్‌ గార్డెన్‌ చిన్న పిల్లలు సైతం తమ తరగతి గదులను తామే శుభ్రం చేసుకుంటారు. సెకండరీ స్కూల్‌ స్థాయిలో ప్రతి విద్యార్థికి ప్రాక్టికల్‌ అనుభవం లభించేలా అత్యాధునిక ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. డిజిటల్‌ లెర్నింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా ఒక్కో ల్యాప్‌టాప్‌ కేటాయించారు. సెకండరీ పాఠశాలల్లో కో–ఎడ్యుకేషన్‌ విధానం ఉంటూ, ఎలాంటి లింగభేదం లేకుండా ప్రతి బెంచీలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కూర్చుంటారు. విద్యార్థులే సొంతంగా రోబోలను తయారు చేస్తున్నారు. వారికి పోటీలు నిర్వహించి ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. ప్రతి విద్యార్థి సొంతంగా విడి భాగాలను డిజైన్‌ చేసుకుంటూ బైక్‌లను సైతం అసెంబుల్‌ చేస్తున్నారు.

దివ్యాంగులకు ప్రత్యేక శ్రద్ధ..

స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పాఠశాలల్లో దివ్యాంగులైన విద్యార్థుల కోసం ఒక్కో విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మానసిక దివ్యాంగులు సైతం పైథాన్‌ కోడింగ్‌ సులభంగా చేయగల్గుతున్నారు. దివ్యాంగుల మానసిక, శారీరక ఎదుగుదల కోసం ప్రత్యేక పరికరాలు, చిన్నచిన్న ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు రూపొందించారు. వారి కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉన్నాయి. స్విమ్మింగ్‌ నేర్పించడానికి ఒక్కో విద్యార్థికి ఒక కోచ్‌ ఉన్నారు.

– అడపాల వాణి, గెజిటెడ్‌ హెచ్‌ఎం, వెంకటేశ్వర్‌నగర్‌(మాల్‌) జెడ్పీఉన్నత పాఠశాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement