ఫార్మాలో అవకాశాలను అందిపుచ్చుకోవాలి
ఫ మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు ఫార్మా రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని మహా త్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. బుధవారం ఎంజీయూలో నిర్వహించిన మన్నె అచ్చిరెడ్డి స్మారకోపన్యాసంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పార్ధసారథి మాట్లాడుతూ.. రసాయన శాస్త్రంలో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు. రసాయన శాస్త్రంలో వేగవంతమైన, సమర్ధవంతమైన పరిశోధనలకు ఏఐ మార్గం సుగమం చేస్తుందన్నారు. ఏఐతో అరుదైన వ్యాధులు, క్యాన్సర్, సంక్రమణ వ్యాధులు, ప్రజారోగ్య సవాళ్లకు వేగంగా పరిష్కారం కనుక్కొనే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ వసంత, డీన్ అన్నపూర్ణ, ఫార్మా కళాశాల ప్రిన్సిపాల్ రఘురామారావు, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రశాంతి, రమేష్, రూప, జ్యోతి, కళ్యాణి, శంకరచారి, అమరేందర్, శ్రీధర్‌రావు, గణేష్, ఆయేషా పాల్గొన్నారు.
విద్యార్థులకు సామాజిక స్పృహ అవసరం
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక స్పృహ అవసరమని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. బుధవారం ఎంజీయూలో ఎన్‌ఎస్‌ఎస్, రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎంతో మంది చనిపోతున్నారని, యువత, విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరంలో విద్యార్థులు, అధ్యాపకుల నుంచి 42 యూనిట్ల రక్తాన్ని అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ మారం వెంకటరమణారెడ్డి, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ప్రొఫెసర్ విజయ్‌బాబు, హరీష్, ఆనంద్, కిరణ్, రమేష్‌నాయక్ పాల్గొన్నారు.
ఉద్యోగ నియామక పత్రాలు అందజేత
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో ఎంపికై న అభ్యర్థులకు బుధవారం వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ హరీష్‌కుమార్ మాట్లాడుతూ.. ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో 16 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ కె. అంజిరెడ్డి, ప్లేస్‌మెంట్ కోఆర్డినేటర్ మారేశ్వర్‌రావు, జయంతి, డీన్ రేఖ తదితరులు పాల్గొన్నారు.


