ఫ ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్ రావు
భువనగిరిటౌన్ : వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్ రావు పేర్కొన్నారు. బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకల్లో ఆమె చిత్రపటానికి భాస్కర్‌రావు పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ జయమ్మ, ఏఓ అంజిరెడ్డి, బీసీ అభివృద్ధి అధికారి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
30లోగా డిజిటల్ పంట సర్వే పూర్తి చేయాలి
డిజిటల్ పంట సర్వేను ఈ నెల 30వ తేదీలోగా నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్ రావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ పంట సర్వే, పంట నమోదుపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా సర్వే పురోగతిని కలెక్టర్ క్షుణ్ణంగా సమీక్షించారు. ముఖ్యంగా సర్వే నమోదులో వెనుకబడిన నారాయణపురం, యాదగిరిగుట్ట మండలాల్లో ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఏఓ పి. వెంకట రమణారెడ్డి డీడీఏ దేవసింగ్, ఏడీఏలు, ఏఓలు పాల్గొన్నారు.


