మోత్కూరు : మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం రాత్రి డీజే సౌండ్‌తో వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. అదే సమయంలో ఇసుక తరలించే ఎడ్ల బండ్లు కూడా చెరువుకట్ట ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో డీజే సౌండ్‌కు రెండు ఎద్దులు బెదిరి చెరువు కట్ట సమీపంలోని బృందావన్ కాల్వలోకి బండితో సహా దూకాయి. ఇది గమనించిన బండిపై ఉన్న వ్యక్తి ముందుగానే పక్కకు దూకాడు. ఎద్దులు పడిన చోట బురద ఉండటంతో వాటికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఊరేగింపుల సమయంలో డీజేలు ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


