వివేరా హోటల్స్‌ చైర్మన్‌కు పర్యాటక అవార్డు | - | Sakshi
Sakshi News home page

వివేరా హోటల్స్‌ చైర్మన్‌కు పర్యాటక అవార్డు

Sep 27 2026 4:04 AM | Updated on Sep 27 2026 4:04 AM

భువనగిరి/నార్కట్‌పల్లి: వివేరా హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ సద్ది వెంకట్‌రెడ్డికి విశిష్ట అవార్డు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌–వరంగల్‌, హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారుల వెంట భువనగిరి, నార్కట్‌పల్లి కేంద్రాలుగా 42 ఏళ్లుగా నాణ్యమైన ఆహారం, వసతి సౌకర్యాలను అందిస్తున్నందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఈ అవార్డును ప్రకటించింది. కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణి ప్రసాద్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గౌతమి, పురాతత్వ (ఆర్కియాలజీ) శాఖ చైర్మన్‌ అర్జున్‌ రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.అవార్డు అందుకున్న అనంతరం సద్ది వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సేవలను గుర్తించి ప్రభుత్వం గౌరవించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వివేరా హోటల్స్‌ మేనేజర్‌ శివ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement