భువనగిరి ఖిలాకే నిధులు
భువనగిరి: అద్భుతమైన ప్రకృతి రమణీయత, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు జిల్లా నిలయం. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఎన్నో ప్రాంతాలు ఇక్కడ ఉన్నా పాలకుల నిర్లక్ష్యంతో ఆ పర్యాటక వైభవం కళతప్పుతోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం నాడు తూతూమంత్రంగా కార్యక్రమాలు నిర్వహించడం మినహా, వాటి అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు శూన్యం. ఒక్క భువనగిరి ఖిలా మినహా మిగిలిన ప్రాంతాలు కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదు.
రాచకొండ గుట్టలకెప్పుడు
మహర్దశ?
సంస్థాన్‌నారాయణపురం మండల పరిధిలోని రాచకొండ గుట్టలు ప్రకృతి సౌందర్యానికి ప్రతీక. 14వ శతాబ్దంలో రేచర్ల పద్మనాయక రాజు అనపోత నాయకుడు సిమెంట్, సున్నం వాడకుండా కేవలం రాళ్లతోనే ఇక్కడ శత్రుదుర్భేద్యమైన కోటను నిర్మించారు. ఇక్కడి రాతి ద్వారాలు, బురుజులు, నాటి శివాలయాలు, సహజసిద్ధమైన జలపాతాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. తెలంగాణ ఏర్పడ్డాక రాచకొండను పర్యాటక హబ్‌గా మారుస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనలు నేటికీ కాగితాలకే పరిమితమయ్యాయి.
జిల్లాలో ప్రస్తుతం ఆదరణకు నోచుకుంటున్న ఏకై క పర్యాటక ప్రాంతం భువనగిరి ఖిలా. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఏకశిలా పర్వత కోటను పశ్చిమ చాళుక్య రాజు ఆరవ త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు నిర్మించారు. ప్రస్తుతం స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద సుమారు రూ. 56 కోట్ల నిధులతో ఖిలా పై కట్టడాల పునరుద్ధరణతో పాటు, రోప్‌వే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రభుత్వం స్పందించి మిగిలిన చారిత్రక ప్రాంతాలను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
ఫ కొలనుపాక జైన మందిరం, రాచకొండ గుట్టల అభివృద్ధిపై పాలకుల నిర్లక్ష్యం
ఫ ప్రపంచ పర్యాటక దినోత్సవం వేళ కూడా మారని చారిత్రక కట్టడాల దుస్థితి
ఫ ‘స్వదేశీ దర్శన్ 2.0’ నిధులతో భువనగిరి ఖిలాకు మాత్రమే కొత్త హంగులు


