ఫ 1952: ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక.
ఫ 1957: చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ నియోజకవర్గం నుంచి నల్లగొండ జిల్లాలో ఏకై క కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపు. అదే ఏడాది రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు.
ఫ 1960: రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం (నల్లగొండ జిల్లా నుంచి తొలి మంత్రి).
ఫ 1965: చిన్నకొండూర్ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం.
ఫ 1969: ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి నేతగా చరిత్ర.
ఫ 1972: భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక.
భూదాన్‌పోచంపల్లి : స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి భూదాన్ పోచంపల్లితో విడదీయని అనుబంధం ఉంది. చేనేత కార్మికుల ఆశాజ్యోతిగా వెలిగిన ఆయన.. తాను బతికుండగానే 2011లో పోచంపల్లిలో తన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కార్మికుల అభ్యున్నతికి పాటుపడిన బాపూజీని స్థానిక చేనేత కుటుంబాలు నేటికీ స్మరించుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మించారు. ఆదివారం బాపూజీ 111వ జయంతి సందర్భంగా పోచంపల్లి పట్టణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
చేనేత కుటుంబాలకు అండగా..
కొండా లక్ష్మణ్ బాపూజీ 1960లో రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు పోచంపల్లిలో 100 మంది చేనేత కార్మికులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఆ కాలనీని నేటికీ లక్ష్మణ్‌నగర్ కాలనీగానే పిలుస్తున్నారు. ఆయన మంత్రిగా ఉన్న హయాంలోనే పోచంపల్లికి విద్యుత్ సౌకర్యం కల్పించారు. బాపూజీ కృషితోనే చేతివృత్తుల వారు సంఘాలుగా ఏర్పడి తమ హక్కుల కోసం ఉద్యమించారు.
అలుపెరగని పోరాటం
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన బాపూజీ.. 1947 డిసెంబర్ 4న నిజాంపై బాంబు దాడికి యత్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969లోనే తన మంత్రి పదవిని వదులుకున్నారు. తొంభై ఏళ్ల వయసులోనూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపట్టడంతో పాటు, సకల జనుల సమ్మెలోనూ పాల్గొన్నారు. ఆయన తన తుదిశ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారు.
ఫ నేడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి
ఫ భూదాన్ పోచంపల్లితో ఆయనకు విడదీయని అనుబంధం
ఫ 1960లోనే చేనేత కార్మికులకు
100 ఇళ్ల నిర్మాణం..
ఊరికి కరెంట్ భాగ్యం
ఫ బతికుండగానే పట్టణంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకున్న నేత


