వైద్య వ్యవస్థలో ఫార్మసీ కీలకం | - | Sakshi
Sakshi News home page

వైద్య వ్యవస్థలో ఫార్మసీ కీలకం

Sep 26 2026 1:44 AM | Updated on Sep 26 2026 1:44 AM

భువనగిరి: ఫార్మసీ వైద్య వ్యవస్థలో కీలకమైన విభాగమని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మనోహర్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ హాల్‌లో ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. వైద్యులు, ఫార్మసిస్టులు, నర్సింగ్‌ సిబ్బంది, ల్యాబ్‌ సిబ్బంది, ఇతర ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మందుల నిల్వ, పంపిణీ, వైద్యుల సూచనల మేరకు వాటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమైనదని అన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఫార్మసిస్టులు శ్రీనివాస్‌, సరిత, నిర్మల, ఉమారాణిలను సన్మానించారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్‌ రామకృష్ణ, పీఓ డాక్టర్‌ వీణ, డెమో పద్మ, జిల్లా స్టోర్‌ ఇన్‌చార్జ్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement