పీఏసీఎస్‌లో అవకతవకలు | - | Sakshi
Sakshi News home page

పీఏసీఎస్‌లో అవకతవకలు

Sep 26 2026 1:44 AM | Updated on Sep 26 2026 1:44 AM

విచారణ జరుపుతాం

యాదగిరిగుట్ట రూరల్‌ : యాదగిరిగుట్ట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్‌)లో యూరియా బస్తాల విక్రయానికి సంబంధించిన డబ్బులు రూ.23,50,000 గల్లంతైన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఇటీవల బాధ్యతలు చేపట్టిన చైర్మన్‌ చీర శ్రీశైలంతో పాటు సహకార సంఘ రైతులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. శుక్రవారం పీఏసీఎస్‌ చైర్మన్‌ చీర శ్రీశైలం అధ్యక్షతన అర్ధవార్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్యతోపాటు డైరెక్టర్లు రైతులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే అవకతవకల అంశం తెరపైకి వచ్చింది.

5 సేల్‌ పాయింట్లు

యాదగిరిగుట్ట పీఏసీఎస్‌ పరిధిలో పట్టణంతో పాటు 12 గ్రామాలు ఉన్నాయి. కాచారం, మల్లాపురం, మసాయిపేట, బాహుపేట, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో 5 సేల్‌ పాయింట్లు ఉన్నాయి. గత పాలకవర్గం హయాంలో, ఈ ఏడాది మార్చి నుంచి జూన్‌ నెల వరకు రైతులకు యూరియా, డీఏపీ బస్తాలను అమ్మారు. ఇందులో 2,700 యూరియా బస్తాలను, ఒక్కో బస్తా రూ.320 చొప్పున అమ్మగా రూ.8,64,000 వచ్చాయి. అదేవిధంగా గ్రోమోర్‌ డీఏపీ 420 బస్తాలను, ఒక్కో బస్తా రూ.2,100 చొప్పున విక్రయించగా రూ.8,82,000 వచ్చాయి. వీటితో పాటు మరికొన్ని బస్తాలు అమ్మినా కంప్యూటర్‌లో మాత్రం నమోదు చేయలేదు. మొత్తంగా రైతుల వద్ద నుంచి వసూలు చేసిన రూ.23,50,000 నగదును బ్యాంకులో జమ చేయలేదు. నూతన చైర్మన్‌ జూలైలో బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆడిట్‌ చేయించడంతో ఈ విషయం బయటపడింది. ఈ డబ్బులు ఎవరు తీసుకున్నారని సిబ్బందిని, సీఈఓను అడిగినా ఎవరూ నోరు మెదపలేదు.

నిలదీసిన విప్‌ అయిలయ్య

రైతులకు యూరియా అమ్మగా వచ్చిన డబ్బులను బ్యాంకులో జమచేయకుండా ఏం చేశారని పీఏసీఎస్‌ సీఈఓను, సిబ్బందిని శుక్రవారం జరిగిన సమావేశంలో విప్‌ అయిలయ్య నిలదీశారు. అయితే వారి నుంచి స్పష్టత రాలేదు. దీంతో యాదగిరిగుట్ట పీఏసీఎస్‌లో యూరియా డబ్బులు మాయమయ్యాయని, దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో బీర్ల అయిలయ్య ఫోన్‌లో మాట్లాడారు. విచారణ జరిపించి బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ఫ రైతులకు అమ్మిన యూరియా బస్తాల డబ్బులు బ్యాంకులో జమ చేయని సిబ్బంది

ఫ రూ.23 లక్షల 50 వేలులెక్కలు చూపలేదని అంచనా

యాదగిరిగుట్ట పీఏసీఎస్‌లో స్టాక్‌ వెరిఫికేషన్‌ నిర్వహించడంతోనే ఈ నిధుల వ్యత్యాసం బయటపడింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. నిబంధనల ప్రకారం స్టాక్‌ అమ్మిన వెంటనే సేల్‌ పాయింట్‌ నిర్వాహకులు నగదును బ్యాంకులో జమ చేయాలి, కానీ ఇక్కడ అలా చేయలేదు.

–నాగరాజు, డీసీఓ, యాదాద్రి భువనగిరి జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement