ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి

Sep 26 2026 1:44 AM | Updated on Sep 26 2026 1:44 AM

భువనగిరిటౌన్‌ : గ్రామాల్లో ఫామ్‌ పాండ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడంతో పాటు భూగర్భ జలాలు పెంపొందే పనులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ భాస్కర్‌ రావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్రణాళిక తయారీ, వీబీజీ రామ్‌జీ పనుల గుర్తింపుపై సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల సర్వతోముఖాభివృద్ధికి అందుబాటులో ఉన్న సహజ, సామాజిక వనరుల మ్యాపింగ్‌ ఆధారంగా శాసీ్త్రయ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైన దృష్ట్యా భవిష్యత్‌లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన పనులను అక్టోబర్‌ 2న నిర్వహించే గాంధీ జయంతి ప్రత్యేక గ్రామసభల్లో ఆమోదం పొందాలని స్పష్టం చేశారు. అనంతరం వీజీపీపీ రూపకల్పన, అమలు విధానాలపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సులో డిప్యూటీ కమిషనర్‌ (పీఎంఓ) సరిత, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, అదనపు డీఆర్‌డీఓ సురేష్‌, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్‌, ఏపీడీ నవీన్‌, రిసోర్స్‌ పర్సన్‌ రాజశేఖర్‌ పాల్గొన్నారు.

ఫ ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ భాస్కర్‌ రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement