ఎస్‌ఎన్‌సీయూపై అలర్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎన్‌సీయూపై అలర్ట్‌

Sep 26 2026 1:44 AM | Updated on Sep 26 2026 1:44 AM

నిరంతర పర్యవేక్షణ

స్వయంగా పర్యవేక్షిస్తున్నాం

భువనగిరి : ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ యూనిట్‌ (ఎస్‌ఎన్‌సీయూ) లో ఐదుగురు పసికందులు మృతి చెందిన దారుణ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో భువనగిరి జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌) భద్రతపై అధికారులు అప్రమత్తమ య్యారు. భువనగిరి ప్రభుత్వ జనర్‌ ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ(స్పెషల్‌ న్యూ బార్న్‌ కేర్‌ యూనిట్‌) నిర్వహణపై విభాగ వైద్యులు, సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించి ముందస్తు జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు.

18 మంది శిశువుల చికిత్సకు సామర్థ్యం

గతంలో 100 పడకల ఏరియా ఆస్పత్రిగా ఉన్న ఈ వైద్యశాల, జిల్లాల పునర్విభజన అనంతరం జిల్లా కేంద్ర ఆస్పత్రిగా మారింది. 2024లో ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు కావడంతో డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పరిధిలోకి వెళ్లి జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిగా రూపాంతరం చెందింది. మాతా శిశు సంరక్షణ విభాగానికి ప్రత్యేక భవనం ఉండాల్సి ఉన్నా.. ప్రస్తుతానికి పాత ఆస్పత్రి భవనంలోనే చాలీచాలని వార్డుల్లో సేవలు అందిస్తున్నారు. 2022 మే 20న రూ.45 లక్షలతో ఆధునీకరించిన ఎస్‌ఎన్‌సీయూ కేంద్రాన్ని పునఃప్రారంభించారు. ఇందులో తక్కువ బరువుతో పుట్టిన, నెలలు నిండని సుమారు 18 మంది పసికందులకు వార్మర్లలో చికిత్స అందించే వెసులుబాటు ఉంది. పిడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో మరో 12 మంది పిల్లలకు వైద్యం అందించవచ్చు.

రోజుకు 12 ప్రసవాలు..

ఈ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా ఉంటోంది. రోజుకు సగటున 8 నుంచి 12 ప్రసవాలు జరుగుతున్నాయి. నెలలు నిండకుండా పుట్టడం, తక్కువ బరువు, శ్వాసకోశ లేదా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే పసికందులను ఎస్‌ఎన్‌సీయూలో చేర్చి వెంటిలేటర్లు, ఇతర అత్యాధునిక పరికరాలతో అత్యవసర వైద్యం అందిస్తున్నారు. తల్లి గర్భంలో ఉన్నట్లు వెచ్చదనాన్ని అందించే వార్మర్లు శిశువు త్వరగా కోలుకోవడానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. జిల్లాలోని వివిధ మండలాల నుంచి కూడా ఇక్కడికి రెఫరల్‌ కేసులు వస్తుండడంతో ఎస్‌ఎన్‌సీయూపై ఒత్తిడి పెరుగుతోంది.

ఎస్‌ఎన్‌సీయూలోని వార్మర్లు, ఇంక్యుబేటర్లు, ఏసీలు, పల్స్‌ బీపీ మానిటర్లు, ఫోటోథెరపీ, వెంటిలేటర్లు, సిరంజి పంపులు వంటి పరికరాలన్నీ పూర్తిస్థాయిలో విద్యుత్‌పైనే ఆధారపడి పనిచేస్తాయి. ఏమాత్రం విద్యుత్‌ అంతరాయం ఏర్పడినా పసికందుల ప్రాణాలకే ప్రమాదం. దీంతో ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యామ్నాయంగా నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం ఆటోమేటిక్‌ జనరేటర్‌ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు విద్యుత్‌ పరికరాలను, కేబులింగ్‌ను తనిఖీ చేస్తున్నారు.

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తున్నాయి. విద్యుత్‌ అంతరాయం ఏర్పడినా సేవలకు భంగం కలగకుండా తక్షణమే జనరేటర్‌ బ్యాకప్‌ పనిచేసేలా ఏర్పాట్లు చేశాం. పసికందులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఎప్పటికప్పుడు వార్డును స్వయంగా పర్యవేక్షిస్తున్నాం. ఇటీవలే ఎస్‌ఎన్‌సీయూ వైద్యులు, సిబ్బందితో సమావేశమై అత్యవసర సమయాల్లో వ్యవహరించాల్సిన తీరుపై పలు సూచనలు చేశాం.

–డాక్టర్‌ లక్ష్మణ్‌, ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌

ఫ భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ విభాగంపై ప్రత్యేక పర్యవేక్షణ

ఫ ఆస్పత్రి సిబ్బందితో ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ సమీక్ష

ఫ ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఘటనతో అప్రమత్తమైన వైద్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement