గుండాల : మహిళా సంఘాలను బలోపేతం చేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళా రైతుల ఉత్పత్తిదారుల కంపెనీని ప్రారంభించారు. అదేవిధంగా 92 సంఘాలకు రూ.8.29 కోట్లు వడ్డీ లేని రుణాల చెక్కును పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళా ఉత్పత్తదారుల కేంద్రంలో రైతులకు కావాల్సిన విత్తనాలను, ఎరువులను విక్రయించి లాభాలు పొందాలన్నారు. రైతులకు అందుబాటులో ఉండేందుకు ఉత్పత్తిదారుల కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి పేదవాడి ఆత్మ గౌరవం రేషన్ కార్డే అని, అందుకు కుటుంబ వివరాలతో స్మార్ట్‌కార్డ్ అందజేస్తున్నట్లు చెప్పారు. ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలుపుతానని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో అర్హుల వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తుందని, పైరవీలకు తావు లేకుండా పాలన సాగిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు దేవనబోయిన అయిలయ్య, అల్లంశెట్టి మహేష్, గూడెపు కుమార్, వల్లాల రమేష్, కాలి మంజూల, మద్దెపురం కొండమ్మ, మచ్చ నాగిరెడ్డి, లింగాల అనిల్‌కుమార్, కాలి పద్మ, తాండ్ర నారాయణ స్వామి, మోత్కూరు మార్కెట్ చైర్‌పర్సన్ నూనెముంతల విమల, గుండాల పీఏసీఎస్ చైర్మన్ అండెం సంజీవరెడ్డి, చేనేత సహకార సంఘం చైర్మన్ చిందం ప్రకాష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపు యాదగిరి గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు ఇమ్మడి దశరథ గుప్తా, ఎస్‌బిఐ డీజీఎం అనిల్‌కుమార్, ఏపీడీ జంగారెడ్డి, ఎంపీడీవో చండీరాణి పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


