వృద్ధులతో బాధ్యతగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

వృద్ధులతో బాధ్యతగా వ్యవహరించాలి

Sep 25 2026 2:35 AM | Updated on Sep 25 2026 2:35 AM

భువనగిరిటౌన్‌ : సమాజంలో వృద్ధుల పట్ల ప్రతిఒక్కరూ ఆదరణ, రక్షణ, బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవీలత, అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి అన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్‌లో సీనియర్‌ సిటిజన్‌ వెల్‌బీయింగ్‌, ఎంపవర్‌మెంట్‌ వీక్‌–2026 కార్యక్రమాలను గురువారం ప్రారంభించారు. అనంతరం తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 సవరణ నియమావళి పుస్తకాలు, ఎల్డర్‌ ఫ్రెండ్లీ కరపత్రాలు, వృద్ధుల సంరక్షణ–గౌరవ ప్రతిజ్ఞ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టపరంగా వృద్ధులకు కల్పించిన హక్కులు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధులకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కుటుంబ సభ్యుల ప్రాథమిక విధి అని తెలిపారు. ఈ వారోత్సవాల ద్వారా జిల్లావ్యాప్తంగా వృద్ధుల ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, భద్రత, సామాజిక గౌరవంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సీహెచ్‌. శ్రీనివాస్‌, అధికారులు, సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, కోఆర్డినేటర్‌, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement