రెడ్‌క్రాస్‌ ఎన్నికలకు 22 నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ ఎన్నికలకు 22 నామినేషన్లు

Sep 25 2026 2:35 AM | Updated on Sep 25 2026 2:35 AM

భువనగిరిటౌన్‌ : జిల్లా భారతీయ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయినట్లు ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి గురువారం తెలిపారు. ఎన్నికల కోసం మొత్తం 22 నామినేషన్లు దాఖలయ్యాయని, వీటిలో 5 సింగిల్‌ నామినేషన్లు, 17 డబుల్‌ నామినేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. దాఖలైన నామినేషన్లను నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం పరిశీలించి తదుపరి ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా.. జిల్లా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ డైరెక్టర్‌ పదవికి రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు వెల్లంకి పురుషోత్తం రెడ్డి గురువారం కలెక్టరేట్‌లోని ఎన్నికల అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

యాదగిరిగుట్టలో సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు గురువారం ఘనంగా కొనసాగాయి. వేకువజామునే ప్రధానాలయంలో అర్చకులు సుప్రభాత సేవ చేపట్టారు. గర్భాలయంలో మూలవర్యులకు, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ఆగమశాస్త్రానుసారంగా అభిషేకాలు చేశారు. స్వామి అమ్మవార్లకు సహస్త్ర నామార్చన, తులసీదళాలతో, అర్చన జరిపించారు. ఆలయ ముఖమండపంలోని ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. ప్రాకార మండపాల్లో శ్రీ సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, గజవాహనసేవ, బ్రహ్మోత్సవం వంటి సేవలు చేశారు. సాయంత్రం స్వామి అమ్మవార్లకు వారికి జోడు సేవోత్సవం, సాయంత్రం శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.

చరిత్రను

అధ్యయనం చేయాలి

రామన్నపేట : విద్యార్థులు చరిత్రను అధ్యయనం చేయాలని ప్రముఖ సాహితీవేత్త తెలుగుశాఖ అధ్యక్షుడు డాక్టర్‌ తండు కృష్ణకౌండిన్య అన్నారు. రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు గురువారం విష్ణుకుండినుల రాజధానిగా వెలుగొందిన ఇంద్రపాలనగరంలోని చారిత్రక ప్రదేశాలను, పురాతన శివాలయాన్ని సందర్శించారు. ఇంద్రపాలనగరం చరిత్రను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ డి.కిషన్‌ పరిపాలనా అధికారి జి.కరుణాకర్‌ అధ్యాపకులు అమర్‌, నరేష్‌, రాంబాబు, కిరణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement