స్పేస్‌ ఆన్‌ వీల్స్‌ | - | Sakshi
Sakshi News home page

స్పేస్‌ ఆన్‌ వీల్స్‌

Sep 24 2026 7:52 AM | Updated on Sep 24 2026 7:52 AM

ఫ ఎన్‌ఆర్‌ఎస్‌సీ ఆధ్వర్యంలో అంతరిక్ష పరిశోధనలు,

ఉపగ్రహాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన

ఫ స్లాట్‌ బుక్‌ చేసుకుంటే బస్సు ద్వారా

నేరుగా పాఠశాలల్లోనే ఇస్రో నమూనాల ప్రదర్శన

చిలుకూరు : ఇస్రో చేస్తున్న అద్భుతమైన అంతరిక్ష పరిశోధనలు, సాధిస్తున్న ప్రగతిని విద్యార్థులకు, యువతకు కళ్లకు కట్టినట్లు వివరించేందుకు ఎన్‌ఆర్‌ఎస్‌సీ (నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌) ‘స్పేస్‌ ఆన్‌ వీల్స్‌’ బస్సు ద్వారా విస్తత ప్రచారం నిర్వహిస్తోంది. శ్రీహరికోట లాంటి రాకెట్‌ ప్రయోగ కేంద్రాలకు నేరుగా వెళ్లి చూసే అవకాశం అందరికీ ఉండదు కాబట్టి, ఆయా ప్రయోగాల నమూనాలను విద్యార్థుల ముంగిటకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఎన్‌ఆర్‌ఎస్‌సీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం చిలుకూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో శక్తి యూత్‌ చొరవతో ఈ బస్సును ప్రదర్శనకు ఉంచారు.

జీడిమెట్ల ఔట్‌రీచ్‌ ఫెసిలిటీ కేంద్రంగా..

హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఎన్‌ఆర్‌ఎస్‌సీకి చెందిన ఔట్‌రీచ్‌ ఫెసిలిటీ కేంద్రం ఉంది. ఇస్రో పరిశోధనల నమూనాలతో అక్కడ ప్రత్యేక ఎగ్జిబిషన్లు ఉంటాయి. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ముందుగా ఈ–మెయిల్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌ చేసుకుంటే, ప్రతిరోజూ 180 నుంచి 200 మంది విద్యార్థులకు (8, 9, 10, ఇంటర్‌ విద్యార్థులకు) ఆ కేంద్రాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తారు. అయితే, నగరానికి వెళ్లలేని గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఈ ‘స్పేస్‌ ఆన్‌ వీల్స్‌’ బస్సును నేరుగా పాఠశాలలకే తీసుకెళ్లి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక చిలుకూరు శక్తి యూత్‌ సభ్యులు ఎన్‌ఆర్‌ఎస్‌సీ ప్రతినిధులను సంప్రదించి, జెడ్పీ పాఠశాలలో విద్యార్థుల కోసం ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేలా..

విద్యార్థులు, యువతను భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎన్‌ఆర్‌ఎస్‌సీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోని పాఠశాలలకు వెళ్లి ఈ ఎగ్జిబిట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో భారత అంతరిక్ష పరిశోధనలకు ఉన్న గుర్తింపును, ప్రయోగాలను నిపుణులు విద్యార్థులకు వివరిస్తున్నారు. ప్రధానంగా ఇస్రో మిషన్స్‌, అంతరిక్ష ప్రయోగ వాహక నౌకలు (లాంచింగ్‌ వెహికల్స్‌), గగన్‌యాన్‌, చంద్రయాన్‌, భారత అంతరిక్ష స్టేషన్‌, ఉపగ్రహాల నమూనాలతో పాటు భూమి, చంద్రుడికి సంబంధించిన త్రీడీ నమూనాలను విద్యార్థులు స్వయంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement