కలెక్టరేట్‌పై మూడో కన్ను | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌పై మూడో కన్ను

Sep 24 2026 7:52 AM | Updated on Sep 24 2026 7:52 AM

భువనగిరిటౌన్‌ : కలెక్టరేట్‌లో ఉద్యోగుల సమయపాలనను కట్టుదిట్టం చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది విధులకు ఆలస్యంగా రావడం, సాయంత్రం వేళల్లో నిర్దేశిత సమయం కంటే ముందే కార్యాలయాన్ని విడిచి వెళ్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇటీవల సిబ్బంది తీరుపై కఠినంగా వ్యవహరించిన అధికారులు ఉదయం 10:45 గంటలకే ప్రధాన గేటుకు తాళం వేసిన విషయం తెలిసిందే. సిబ్బందిలో క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో కలెక్టరేట్‌ ఆవరణలోని ప్రధాన గేటు వద్ద ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కార్యాలయ ప్రవేశ మార్గం గుండా ఎవరు వస్తున్నారు? ఎవరు బయటకు వెళ్తున్నారు? అనే అంశాలను కలెక్టర్‌ తన చాంబర్‌లోని టీవీ మానిటర్ల ద్వారా నిరంతరం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్‌ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

బాధితులకు న్యాయం చేస్తాం

ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య

భువనగిరి: బస్వాపూర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య హామీ ఇచ్చారు. భువనగిరి మండలం బస్వాపూర్‌ ప్రాజెక్టు పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నష్టపరిహారం, పునరావాసం అందించడంలో జరుగుతున్న అలసత్వం, ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపాలపై పలు ఫిర్యాదులు అందడంతో బుధవారం ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికే వచ్చానన్నారు. ఎస్సీ, ఎస్టీల హక్కులు, ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా చూస్తామన్నారు. సమగ్ర నివేదికను సీఎంకు అందజేస్తామని తెలిపారు.

యాదగిరి క్షేత్రంలో పూజలు

యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. ప్రధానాలయంలోని స్వయంభువులను దర్శించుకున్న చైర్మన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానాలయం ముఖ మండపంలో ఉన్న ఉత్సవ మూర్తుల వద్ద అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత వేదమండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామి వారి లడ్డూ ప్రసాదం అందజేశారు.

ఫ ప్రధాన గేటు వద్ద సీసీ కెమెరాల నిఘా

ఫ ఉద్యోగుల రాకపోకలపై కలెక్టర్‌ పర్యవేక్షణ

ఫ సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement