భువనగిరి: బీఎన్ తిమ్మాపురం పునరావాస గ్రామాన్ని సకల హంగులతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం భువనగిరి పట్టణ శివారులోని బస్వాపూర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న బీఎన్ తిమ్మాపురం పునరావాస కాలనీలో మౌలిక వసతుల కల్పన పనులను ప్రారంభించి మాట్లాడారు. గ్రామాన్ని ఖాళీ చేస్తే రిజర్వాయర్‌లోకి నీటిని నింపే అవకాశం ఉంటుందన్నారు.అందువల్ల ప్రభుత్వం ముందుగా పరిహారం కింద రూ. 30కోట్లు, అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌లను కోరితే వెంటనే రూ. 206 కోట్లు మంజూరు చేశారన్నారు. ఇందులో రూ. 45 కోట్లతో కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్‌చిస్తీ, పీఏసీఎస్ చైర్మన్ ఫక్కీర్ కొండల్‌రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల, కాంగ్రెస్‌పార్టీ పట్టణ, మండల కమిటీల అధ్యక్షులు కూర వెంకటేశం, ఎల్లంల జంగయ్య, గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్ తుమ్మెటి పాండు తదితరులు పాల్గొన్నారు.


