రామన్నపేట: ప్రజల కోసం పనిచేసిన కమ్యూనిస్టులు వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పేర్కొన్నారు. బుధవారం రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో అనారోగ్యంతో మృతిచెందిన మాజీ వైస్‌ఎంపీపీ పబ్బతి లింగయ్య మృతదేహం వద్ద ఆయన పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సంతాపసభలో జాన్‌వెస్లీ మాట్లాడారు. లింగయ్య తుది శ్వాసవరకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఎర్రజెండాను చేబూని ప్రజల కోసం పనిచేసిన ఆదర్శ నాయకుడని కొనియాడారు. పార్టీ మాజీ కేంద్రకమిటీ సభ్యుడు సీతారాములు మాట్లాడుతూ లింగయ్య మృతి .. పార్టీకి ప్రజా ఉద్యమానికి తీరని లోటని అన్నారు. గ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో పార్టీశ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.డీ జహంగీర్, నాయకులు మేక అశోక్‌రెడ్డి, కల్లూరి మల్లేశం, కొండమడుగు నర్సింహ, పైళ్ల ఆశయ్య, జెల్లెల పెంటయ్య పి. అచ్చాలు, రాగిరి కిష్టయ్య, బి.జయరాములు, సిర్పంగి స్వామి, వెంకటేశం, కల్లూరి నాగేష్, కందుల హన్మంత్, ఆనంద్, నాగటి ఉపేందర్, ఐలయ్య, రశీద్, రజిత, మల్లేశం, ఉదయ్‌కుమార్, అంజయ్య, లింగస్వామి పాల్గొన్నారు.
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ


