మోత్కూరు: మోత్కూరు పట్టణంలోని పెద్ద చెరువు కట్ట రోడ్డు పరిస్థితి అధ్వానంగా తయారైంది. సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి. ప్రతిరోజూ వందలాది వాహనాలు, వేలాది మంది ప్రయాణికులు ఈ మార్గం గుండానే ప్రయాణిస్తుంటారు. సరైన నిర్వహణ లేక ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే జంకుతున్నారు.
కంకరతేలి ప్రమాదకరంగా..
గత ప్రభుత్వ హయాంలో మినీ ట్యాంక్‌బండ్ ప్రాజెక్టులో భాగంగా సుమారు రూ. 6 కోట్లతో చెరువు కట్ట మరమ్మతులు, ఫుట్‌పాత్‌లు, రెయిలింగ్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ ప్రస్తుతం కట్టంతా గుంతలమయమై, కంకర తేలి ప్రమాదకరంగా మారింది. ఫుట్‌పాత్‌లు పూర్తిగా పగిలిపోయి నడవడానికి వీలులేకుండా ఉన్నాయి. ఇనుప రెయిలింగ్ తుప్పుపట్టి, పలు చోట్ల విరిగిపోయింది.
రూ. 36 లక్షలు వెచ్చించినా తీరని బురద తిప్పలు
గత వర్షాకాలంలో కట్ట రోడ్డు కుంగిపోవడంతో, ఇటీవల అధికారులు రూ. 36 లక్షలతో సుమారు 20 మీటర్ల మేర బీటీ వేయకుండా మట్టితో మరమ్మతులు చేసి వదిలేయడంతో పరిస్థితి యథాస్థితికి వచ్చింది. కొద్దిపాటి వర్షం పడినా బురదమయంగా మారి వాహనాలు జారిపడే ప్రమాదం పొంచి ఉంది.
ప్రధానంగా ఫుట్‌పాత్‌లు మధ్య మధ్యన తెగి నామరూపాలు లేకుండా పోయాయి. సిమెంటు స్లాబు, పలు చోట్ల ఇనుప రెయిలింగ్ ధ్వంసమైంది. రోడ్డుపై పలు చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. మినీ ట్యాంక్‌బండ్ వద్ద ప్రకృతిని ఆస్వాదిండ లేకుండా పోయింది. ఇరిగేషన్, రోడ్లు, భవనాల శాఖల అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలి. – సోమిరెడ్డి, సీనియర్ సిటిజన్
అధ్వానంగా మోత్కూరు పెద్ద చెరువు కట్ట రోడ్డు
ఫ ధ్వంసమైన ఫుట్‌పాత్‌లు
ఫ తుప్పుపట్టి విరిగిన రెయిలింగ్
ఫ ఇబ్బందుల్లో పాదచారులు, వాహనదారులు


