మిర్యాలగూడ అర్బన్ : ఫైనాన్స్‌లో తీసుకున్న వాహనాల కిస్తీలు చెల్లించని వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు ఇలాంటి నయా దందాకు తెరలేపారు. సదరు ఫైనాన్స్ సంస్థల సిబ్బందితో కుమ్మకై ్క, రికవరీ ఏజెంట్ల పేరుతో దౌర్జన్యంగా వాహనాలను లాక్కెళ్తున్నారు. అలా సీజ్ చేసిన వాహనాలను కంపెనీలకు అప్పగించకుండా వేరే వ్యక్తులకు విక్రయించడం లేదా కుదవబెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. మిర్యాలగూడలో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
దందా సాగుతోందిలా..
ఫైనాన్స్‌లో వాహనం తీసుకున్న వ్యక్తులు కొద్ది నెలలు బాగానే కిస్తీలు కట్టినా, ఆర్థిక ఇబ్బందుల వల్ల చెల్లింపులు ఆగిపోతే ఆ వాహనం నంబర్‌ను ఓ ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. సీజింగ్ ఏజెంట్లుగా చెలామణి అవుతున్న కొందరు ఒక ముఠాగా ఏర్పడి, ఆ యాప్ ద్వారా బైక్ ఎక్కడ తిరుగుతుందో పసిగడతారు. పలు కూడళ్లలో కాపుకాసి దౌర్జన్యంగా వాహనాలను లాక్కెళ్తున్నారు. బండిపై కుటుంబ సభ్యులు ఉన్నా సరే నడిరోడ్డుపై దించేసి తీసుకెళ్తున్నారు. నిబంధనల ప్రకారం.. సీజ్ చేసిన వాహనాన్ని ఫైనాన్స్ కార్యాలయంలో అప్పగించి, సీజింగ్ లెటర్‌ను వాహనదారుడికి ఇవ్వాలి. కానీ, ఫైనాన్స్ మేనేజర్లతో కుమ్మక్కవుతున్న ఈ వ్యక్తులు ఆ బైక్‌లను అమ్ముకోవడం లేదా కుదవబెట్టి డబ్బులు పంచుకుంటున్నారు. వీరికి స్థానిక రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉండటంతో ఇన్నాళ్లూ అడ్డూఅదుపు లేకుండా పోయింది.
మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి..
మిర్యాలగూడకు చెందిన ఓ మహిళ తన పేరిట ఫైనాన్స్‌లో బైక్ తీసుకుంది. కొన్ని కిస్తీలు కట్టాక ఆర్థిక ఇబ్బందులతో చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో ఫైనాన్స్ సీజింగ్ పేరుతో వచ్చిన వ్యక్తి ఆమె బైక్‌ను తీసుకెళ్లాడు. అనంతరం దాన్ని తన సొంత ఖర్చుల కోసం మరొకరి వద్ద కుదవబెట్టాడు. కొద్దిరోజుల తర్వాత ఆ బైక్ వేరొకరి వద్ద కనిపించడంతో ఆమె సదరు ఫైనాన్స్ సంస్థను నిలదీసింది. బైక్ సీజింగ్ వ్యవహారం తమకు తెలియదని వారు చెప్పడంతో మోసపోయానని గ్రహించిన మహిళ మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
నల్లగొండకు చెందిన ఓ మధ్యతరగతి
కుటుంబం ప్రైవేట్ ఫైనాన్స్‌లో ఓ స్కూటీని
తీసుకుంది. కిస్తీలన్నీ సక్రమంగా చెల్లించినా చివరి కిస్తీ రూ.3,300 ఆగిపోయింది. రెండు నెలల తర్వాత ఆ స్కూటీపై వెళ్తున్న సదరు కుటుంబ సభ్యులను కొందరు వ్యక్తులు అడ్డగించి.. కిస్తీ పెండింగ్ ఉందని చెప్పి స్కూటీని లాక్కెళ్లారు. బాధితుడు రెండు రోజుల తర్వాత సదరు ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి డబ్బులు చెల్లిస్తానని అడగగా.. ‘మేము బండి సీజ్ చేయలేదు.. చేస్తే ఇక్కడే ఉండాలి కదా’ అని వారు సమాధానం చెప్పారు. దీంతో అతడు అవాక్కయ్యాడు. కాగా.. ఆ స్కూటీ ఏడాది తర్వాత మిర్యాలగూడ పట్టణంలో మరో వ్యక్తి వద్ద కనిపించడం గమనార్హం.
ఫ రికవరీ ఏజెంట్ల పేరిట ఘరానా మోసం
ఫ ప్రత్యేక యాప్‌తో వాహనాల గుర్తింపు.. దౌర్జన్యంగా పట్టివేత
ఫ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి సీజ్ చేసిన
వాహనాలు
ఫ ఫైనాన్స్ సంస్థల కనుసన్నల్లోనే వ్యవహారం
ఫ ఓ మహిళ ఫిర్యాదుతో కదిలిన డొంక
ఫ నాలుగు బైక్‌లను స్వాధీనం
చేసుకున్న పోలీసులు


