డ్రగ్స్‌కు దూరంగా ఉండండి భక్తులారా.. | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి భక్తులారా..

Sep 24 2026 7:52 AM | Updated on Sep 24 2026 7:52 AM

సూర్యాపేటటౌన్‌ : వినాయకుని నిమజ్జన వేడుకలను పురస్కరించుకుని సూర్యాపేట పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్‌పై ప్రభుత్వ ఉపాధ్యాయుడు బుధవారం వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్దిరాల మండలం గోరంట్ల జెడ్పీహెచ్‌ఎస్‌ తెలుగు ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్‌ వినాయకుని వేషధారణలో.. వాహనదారులు హెల్మెట్‌ పెట్టుకోవాలని, డ్రగ్స్‌, గంజాయికి దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. వినాయకుడికి తల తొలగితే మరో తల వచ్చినా.. మనుషులకు అలా జరగదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్‌ పెట్టుకో వాలని, మద్యం, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపరాదన్నారు. అతివేగాన్ని నియంత్రించి రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. యువత, విద్యార్థులు డ్రగ్స్‌, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రభాకర్‌ సూచించారు. కరపత్రాలు, ఫ్లెక్సీలు, మైక్‌సెట్‌ ద్వారా ప్రజలకు సందేశాన్ని అందించారు.

హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ పెట్టుకోండి నాయనా..

గణపయ్య వేషధారణలో ప్రజలకు

అవగాహన కల్పించిన ఉపాధ్యాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement