యాదగిరిగుట్ట: ప్రధాని నరేంద్రమోదీని ఆదర్శంగా తీసుకొని నేటి యువత సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయాల్లోకి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలో సోమవారం సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 25వేల మంది యువకులతో రక్త దానం చేయాలని సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. యాదగిరీశుడి సన్నిధిలోని వైకుంఠద్వారం వద్ద చాలా మంది రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. దేశ వ్యాప్తంగా పేద ప్రజల కోసం ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్, కిసాన్ యోజన్ వంటి పథకాలను తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్‌గౌడ్, ప్రధాన కార్యదర్శులు కాధూరి అచ్చయ్య, చందా మహేందర్, జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, సీనియర్ నాయకులు మాయ దశరథ, రచ్చ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు బెలిదె అశోక్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధూరి, గుంటిపల్లి సత్యం, నల్ల వెంకట్‌రెడ్డి, మందోజు నరేష్, సురేష్, కర్ణ, బుచ్చిబాఆబు, సూధగాని శివ, వినోద్, శ్రీశైలం, విజయ్, దేవేందర్ పాల్గొన్నారు.
ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు


