భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి సంప్రదాయ చేనేత వస్త్రాలు ఎంతో బాగున్నాయని తమిళనాడు రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీఎన్. వెంకటేశ్ కొనియాడారు. సోమవారం పోచంపల్లి పట్టణంలోని చేనేత సహకార సంఘం, టూరిజం పార్కును ఆయన సందర్శించి మగ్గాలు, చేనేత వస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమిళనాడులో ఎక్కువగా ధోతీ కల్చర్ ఉంటుందని, కానీ తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్, నారాయణపేట, గద్వాల, సిద్దిపేట గొల్లభామ చీరలకు ప్రాంతాల వారీగా అనేక ప్రత్యేకతలు ఉంటాయన్నారు. తెలంగాణలోని త్రిఫ్ట్ పథకం తరహాలోనే తమిళనాడులో కూడా ‘సొసైటీ బెనిఫిట్ స్కీమ్’ కింద చేనేత కార్మికులు తమ ఆదాయం నుంచి 8 శాతం జమచేస్తే, ప్రభుత్వం 16 శాతం ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత లవకుమార్, వెంకటరమణ సిల్క్ సొసైటీ అధ్యక్షుడు చింతకింది రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ తమిళనాడు చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీఎన్. వెంకటేశ్


