భువనగిరిటౌన్ : ఎన్‌హెచ్–930పీ నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట పోచంపల్లి, వలిగొండ మండలాల రైతులు ధర్నా నిర్వహించారు.
రూ. 12 లక్షలే ఇస్తారా..
బహిరంగ మార్కెట్లో ఎకరాకు రూ. 2 కోట్లకు పైగా విలువ పలుకుతున్నా తమ భూములకు ప్రభుత్వం కేవలం రూ. 11 లక్షల నుంచి రూ. 12 లక్షలు పరిహారంగా ఇవ్వడం అన్యాయమని కలెక్టర్‌తో నిహించిన సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌ఆర్‌ఆర్, చౌటుప్పల్ పరిధిలో మాదిరిగా పరిహారాన్ని ఇవ్వాలని అప్పటి వరకు పనులు కొనసాగనివ్వబోమన్నారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ వారం రోజుల్లోగా ఆర్బిట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, భూబాధితుల జేఏసీ కన్వీనర్ వారాల శేఖర్ రెడ్డి, పాక మల్లేశ్ యాదవ్, సామ మధుసూదన్ రెడ్డి, కోట రామచంద్ర రెడ్డి, సామ రవీందర్ రెడ్డి, సుర్కంటి వెంకట్ రెడ్డి, తనేషా, నోముల జంగా రెడ్డి, మహేశ్, రవీందర్, బుచ్చి రెడ్డి పాల్గొన్నారు,


