వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా

Sep 22 2026 5:22 AM | Updated on Sep 22 2026 5:22 AM

చౌటుప్పల్‌ : వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తామని ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌పాటిల్‌ తెలిపారు. ఇందులో ఎలాంటి రాజీ ఉండబోదన్నారు. చౌటుప్పల్‌ మండల పరిధిలోని జైకేసారం గ్రామంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను సోమవారం సందర్శించారు. విద్యుత్‌ సరఫరాపై అక్కడి ఆపరేటర్లు, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి విద్యుత్‌ సరఫరాపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి అనుకున్న ప్రకారంగా సరఫరా ఉంటుందన్నారు. ఎక్కడ కూడా చిన్నపాటి అంతరాయం లేకుండా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ అధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తమ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అన్ని కేటగిరీలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తుందన్నారు. ఆయన వెంట ట్రాన్స్‌కో రూరల్‌ జోన్‌ సీజీఎం బాలస్వామి, ఎస్‌ఈ సురేష్‌, డీఈ మల్లికార్జున, ఏడీఈ పద్మ, ఏఈ రాజుల సతీష్‌యాదవ్‌, సిబ్బంది, రైతులు ఉన్నారు.

ఫ ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌పాటిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement