ప్రభుత్వ రంగ సంస్థల రక్షణకు పోరాడుదాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ రంగ సంస్థల రక్షణకు పోరాడుదాం

Sep 21 2026 7:17 AM | Updated on Sep 21 2026 7:17 AM

భువనగిరిటౌన్‌ : ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, నాలుగు లేబర్‌ కోడ్ల రద్దుకు ఉద్యోగులు, కార్మికులు సంఘటితంగా పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరిలో జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్‌, రైల్వే, ఎల్‌ఐసీ వంటి కీలక ప్రభుత్వ రంగాలను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేందుకు చూస్తోందని మండిపడ్డారు. విద్యుత్‌ సంస్కరణలు, స్మార్ట్‌ మీటర్లతో వినియోగదారులపై చార్జీల భారం పడటంతో పాటు రైతులకు ఉచిత విద్యుత్‌ దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో డిసెంబర్‌ 1, 2, 3 తేదీల్లో జరిగే నిరసన కార్యక్రమాలకు విద్యుత్‌, రైల్వే, ఎల్‌ఐసీ, ఆర్టీసీ సహా అన్ని రంగాల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దాసరి పాండు, మాయ కృష్ణ, శ్రీనివాస్‌, మల్లేశం, యాదప్ప, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫీజుల నియంత్రణకు కమిషన్‌ ఏర్పాటు చేయాలి

నల్లగొండ : ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణతోపాటు సీట్ల నియంత్రణకు ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేయాలని డెమొక్రటిక్‌ ఆల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (డేటా) సంఘం నాయకులు అన్నారు. ఆదివారం నల్లగొండలోని టీఎన్‌యూటీఓ భవన్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మహ్మద్‌ మొహినొద్దీన్‌, డీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వెంకటదాసు, హైకోర్టు న్యాయవాది పద్మారావు, డి.రాములు, డీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు, టీపీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌.సుధాకర్‌, టీజేఎస్‌ నాయకులు పన్నాల గోపాల్‌రెడ్డి, రవి కిశోర్‌, పన్నాల గోపాల్‌రెడ్డి, నాగలక్ష్మి, పి.రజిత, సీహెచ్‌.సుధాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement