యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆదివారం శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. స్వయంభూ పంచనారసింహులకు బిందే తీర్థం, ఆరాధన, బాలభోగం నిర్వహించి, నిజాభిషేకం జరిపించారు. సహస్రనామార్చన చేపట్టి, తులసీ దళాలతో అర్చించారు. అనంతరం గజ వాహన సేవ, నిత్య కల్యాణం, జోడు సేవలు చేపట్టారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన, ప్రథమ ప్రాకార మండపంలో వేద ఆశీర్వచనం పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామి వారికి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.


