రామన్నపేట : రామన్నపేట మండల కేంద్రం నుంచి పల్లెపాడు వరకు దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జెల్లెల పెంటయ్య, మునిపంపుల, దుబ్బాక సర్పంచులు బొడ్డుపల్లి వెంకటేశం, గట్టు నర్సింహ డిమాండ్ చేశారు. ఆదివారం దుబ్బాక, మునిపంపుల గ్రామాల్లో గుంతలమయంగా మారిన రోడ్లు, మురుగునీరు నిలిచిన ప్రదేశాల్లో సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు కనీసం గుంతలను పూడ్చే ప్రయత్నం కూడా చేయకపోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కల్లూరి నాగేష్, జంపాల అండాలు, తొల్పునూరి శ్రీనివాస్, మేడి గణేష్, పావిరాల మత్స్యగిరి, తాళ్లపల్లి జితేందర్, తొల్పునూరి చంద్రశేఖర్, పుట్టల ఉదయ్, గంటెపాక శివకుమార్, దండిగ నర్సింహ, ఉండ్రాతి నర్సింహ, జోగుల శ్రీనివాస్, గాదె పరమేష్, మేడి బాషయ్య తదితరులు పాల్గొన్నారు.


