యాదగిరిగుట్ట : తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారని టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ మాజీ సభ్యుడు వడ్లోజు వెంకటేష్ ఆరోపించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు లేదని ఈడీ తేల్చడంపై యాదగిరిగుట్టలో ఆదివారం వేంకటేశ్వరస్వామి, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వడ్లోజు వెంకటేష్ మాట్లాడుతూ.. ఈడీ ఇచ్చిన తీర్పుతో చంద్రబాబునాయుడు అసత్య ప్రచా రాలను మానుకోవాలని సూచించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల వేళ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తిరుమలేశుడి ఆశీస్సులు ఉన్నాయని, అందుకే చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలకు బుద్ధి చెప్పే విధంగా నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని తీర్పు వచ్చిందన్నారు.


