విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

Sep 21 2026 7:17 AM | Updated on Sep 21 2026 7:17 AM

సంస్థాన్‌ నారాయణపురం : మండలంలోని సర్వేల్‌ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కష్టపడి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య ఆకాంక్షించారు. ఆదివారం సర్వేల్‌ గురుకుల పాఠశాలను బక్కి వెంకటయ్యతో పాటు కమిషన్‌ పభ్యులు జిల్లా శంకర్‌, కొంకటి లక్ష్మీనారాయణ, నేనవత్‌ రాంబాబునాయక్‌ సందర్శించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం తరగతి గదులు, వసతి గదులు, డైనింగ్‌ హాల్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, సమస్యలపై ఆరా తీశారు. డైనింగ్‌ హాల్‌లో భోజనం చేసి ఆహారం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. సర్వేల్‌ గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు ఆలిండియా సర్వీసులతో పాటు ప్రజాప్రతినిధులుగా సేవలందించారని, సర్వేల్‌ గురుకులానికి ఎంతో పేరుప్రతిష్టలు ఉన్నాయని అన్నారు. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. గురుకులాల్లో ఇప్పటి వరకు గుర్తించిన సమస్యలను ఈ నెల 22న జరిగే హైపవర్‌ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్యతో పాటు కమిషన్‌ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేష్‌, సర్వేల్‌ మాజీ సర్పంచ్‌ కట్టెల భిక్షపతి, బీఆర్‌ఎస్‌వీ మునుగోడు నియోజకవర్గ కార్యదర్శి గుమ్మాల ప్రవీణ్‌కుమార్‌, మల్లేష్‌ తదితరులు ఉన్నారు.

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌

బక్కి వెంకటయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement