విద్యుదాఘాతంతో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Sep 21 2026 7:17 AM | Updated on Sep 21 2026 7:17 AM

వలిగొండ : విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఏబీ స్విచ్‌ ఆన్‌ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములకొండకు చెందిన ఎనుగుల ఐలయ్య(41) శనివారం రాత్రి తన కుమారుడితో కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. అక్కడ బోరు మోటారు ఆన్‌ చేయగా.. విద్యుత్‌ సరఫరా కావట్లేదని గమనించారు. దీంతో ఐలయ్య పక్కనే ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లి ఏబీ స్విచ్‌ ఆన్‌ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై స్పృహతప్పి కింద పడిపోయాడు. అతడి కుమారుడు వెంటనే చికిత్స నిమిత్తం ఐలయ్యను రామన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. ఆదివారం మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్రెడ్డి తెలిపారు.

భార్య కనిపించడం లేదని

భర్త ఫిర్యాదు

మర్రిగూడ : తన భార్య కనిపించడం లేదని ఓ వ్యక్తి ఆదివారం మర్రిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా లక్ష్మి ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త యాదయ్య స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రాంబాబు తెలిపారు.

మోసగాడి రిమాండ్‌

మర్రిగూడ : తక్కువ ధరకే బంగారం ఇస్తానని నమ్మించి ఓ వ్యక్తి వద్ద రూ.6,20,000 కాజేసిన మోసగాడిపై కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లు నాంపల్లి సీఐ దూది రాజు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం మందపాక గ్రామానికి చెందిన మాచర్ల వెంకటేష్‌.. మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. తక్కువ ధరకే బంగారు నాణాలు ఇప్పిస్తానని నమ్మించి అతడి వద్ద నుంచి సొమ్మును తీసుకుని మోసం చేసినట్లు సీఐ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వెంకటేష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement