ఆత్మకూరు(ఎం) : పోరాటాల మార్గంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరు(ఎం) మండలంలో లోలెవల్ బ్రిడ్జిలను హైలెవల్ బ్రిడ్జిలుగా నిర్మించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉప్పల ముత్యాలు, మండల కార్యదర్శి మారుపాక వెంకటేశం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివారం రాయిపల్లి వద్ద సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా పోరాటాలతోనే చట్టాలు వస్తాయని, వాటి అమలు కోసం పోరాటాలు చేయాల్సి వస్తుందన్నారు. పాదయాత్రలో నాయకులు ఎండీ నయీం, గుర్రం రాజమణి, జక్క దయాకర్‌రెడ్డి, కల్వల నర్సయ్య, జల్ధి రాములు, బొబ్బల లాల్‌రెడ్డి, సోలిపురం లింగారెడ్డి, గాజుల సిద్దులు పాల్గొనగా.. సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు బొలగాని సత్యనారాయణ, చేడె చంద్రయ్య, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పాశికంటి లక్ష్మీనర్సయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, ఎండీ ఇమ్రాన్, చెక్క వెంకటేష్, కుసుమరి హరిశ్చంద్ర, పేరబోయిన మహేందర్, బండి జంగమ్మ, బబ్బురి శ్రీధర్ పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి


