నయా జమీందారీ శక్తులపై పోరాడాలి | - | Sakshi
Sakshi News home page

నయా జమీందారీ శక్తులపై పోరాడాలి

Sep 17 2026 2:20 AM | Updated on Sep 17 2026 2:20 AM

మిర్యాలగూడ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేస్తుందని, ఇటువంటి నయా జమీందారీ శక్తులపై పోరాడాలని అఖిల భారత కిసాన్‌ సభ(ఏఐకేఎస్‌) జాతీయ కార్యదర్శి విజ్జు కృష్ణన్‌ అన్నారు. బుధవారం మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం, నల్లగొండలో జరిగే ఏఐకేఎస్‌ జాతీయ మహాసభల జయప్రదం కోసం ఫండ్‌ క్యాంపెయినింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అమరవీరుల స్థూపాలకు ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నివాళులర్పించారు. అనంతరం విజ్జు కృష్ణన్‌ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి కోసం నాడు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆదర్శనీయమని అన్నారు. ఈ పోరాట ఫలితంగా 10లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని, 4వేల గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భూసంస్కరణలు, భూదానోద్యమానికి పాలకులు పూనుకోవాల్సిన పరిస్థితిని ఈ పోరాటం కల్పించిందన్నారు. దేశంలోని ఖనిజ సంపదను బడా కార్పొరేట్లకు కేంద్రం కట్టబెడుతుందని ఆరోపించారు. నల్లగొండలో జరిగే అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్‌, పోతినేని సుదర్శన్‌, తీగల సాగర్‌, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, నూకల జగదీశ్‌చంద్ర, బొగ్గారపు కృష్ణయ్య, వరలక్ష్మి, గోవర్ధన, అరుణ, కౌసల్య తదితరులు పాల్గొన్నారు.

రైతు సమస్యలపై ఐక్య పోరాటాలు అవసరం

మేళ్లచెరువు : రైతాంగ సమస్యలపై ఐక్య పోరాటాలు అవసరమని అఖిల భారత కిసాన్‌ సభ(ఏఐకేఎస్‌)జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. బుధవారం చింతలపాలెం మండల కేంద్రానికి వచ్చిన ఆయన గ్రామంలో రైతాంగ పోరాటంలో ప్రాణాలర్పించిన రైతుల స్థూపం వద్దకు చేరుకొని నివాళులర్పించి మాట్లాడారు. భూముల పరిరక్షణ, ఉచిత విద్యుత్‌, గిట్టుబాటు ధరపై రైతులను సమీకరించి దేశవ్యాప్త ఉద్యమాలు నిర్వహిహిస్తామన్నారు. ఆయన వెంట రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి, పల్లె వెంకట్‌రెడ్డి, వట్టెపు సైదులు, సుందరమౌళేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.

ఫ ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి

విజ్జు కృష్ణన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement