నేరేడుచర్ల : నూతనంగా నిర్మిస్తున్న భవనంపై నుంచి పడి వ్యక్తి కూలీ మృతిచెందాడు. ఈ ఘటన నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామంలో జరిగింది. బుధవారం ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దిర్శించర్ల గ్రామానికి చెందిన పత్తేపురం వెంకటేశ్వర్లు నూతనంగా ఇంటిని నిర్మించుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన అంతని సావిత్రి(27) అనే వ్యక్తి ఈ నెల 14న వెంకటేశ్వర్లు నిర్మిస్తున్న ఇంటికి సుతారీ పనికి వెళ్లాడు. రెండో అంతస్తు స్లాబ్ వేస్తుండగా సావిత్రి ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతిచెందాడు. మృతుడి తల్లి కోటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు అవివాహితుడు. అతడు తన తల్లి వద్దనే ఉంటూ సుతారీ పనికి వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడి అన్న, చెల్లెలు ఇతర ప్రాంతాల్లో ఉంటుండటంతో మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలోనే ఉంచి బుధవారం అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తరలించారు. అయితే బిల్డింగ్ యాజయాని మొదట ఇస్తానన్న నష్టపరిహారం ఇవ్వనని చెప్పడంతో సావిత్రి మృతదేహంతో నూతనంగా నిర్మిస్తున్న భవనం ఎదుట బుధవారం కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.
ఫ మృతదేహంతో కుటుంబ సభ్యుల ధర్నా


