హుజూర్‌నగర్ : సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మిక కుటుంబాలకు ఈ–శ్రమ్ ఇన్సూరెన్స్ అండగా నిలుస్తుందని దత్తోపంత్ టెంగడీ నేషనల్ బోర్డు ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ (డీటీఎన్‌బీడబ్ల్యూడీ) తెలంగాణ రీజనల్ డైరెక్టర్ ఎంఆర్ దేశ్‌పాండే అన్నారు. బుధవారం జాతీయ కార్మిక విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని హుజూర్‌నగర్ పట్టణంలోని పద్మశాలీ భవన్‌లో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్ అధ్యక్షతన కార్మికులకు ఈ–శ్రమ్ ఇన్సూరెన్స్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 నుంచి 59 ఏళ్ల లోపు వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులందరూ ఈ–శ్రమ్ ఇన్సూరెన్స్ కార్డులు తీసుకోవాలన్నారు. ఈ–శ్రమ్ కార్డు ఉంటేనే మిగతా ఇన్సూరెన్స్‌లు కూడా కార్మిక కుటుంబాలకు సులభంగా అందుతాయన్నారు. కార్మికులకు వారి హక్కులు, చట్టాలు గురించి కార్మిక విద్యాసంస్థల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. భారత కార్మిక రంగ అభ్యున్నతకై తమ సంస్థ ద్వారా ఎంతగానో కృషి చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో వర్కర్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహేశ్వర్ బాబు, సీనియర్ ఆఫీసర్లు సంశీర్, అభిలాష్, నరసింహ, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, నాయకులు యరగాని నాగరాజు, యరగాని మురళి, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బంటు చుక్కయ్య, నియోజకవర్గ, మండల నాయకులు బెల్లంకొండ గురవయ్య, అమర్‌నాథ్‌రెడ్డి, మేళ్లచెర్వు ముక్కంటి, మద్దం నాగేందర్, ఎస్.జానయ్య, జి.కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాస్, కె.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఫ డీటీఎన్‌బీడబ్ల్యూడీ రీజనల్
డైరెక్టర్ ఎంఆర్ దేశ్‌పాండే


