నకిరేకల్ : నకిరేకల్‌కు చెందిన సీపీఎం నాయకుడు బిచినేపల్లి ప్రకాష్‌రావు (85) అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు. ప్రకాష్‌రావు మండల పరిషత్ సూపరిండెంట్‌గా పనిచేసి 28 ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. సీనియర్ సిటిజన్స్ డివిజన్ అధ్యక్షుడిగా, లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ఉద్యగ విరమణ అనంతరం లాయర్‌గా ప్రాక్టీస్ చేయడంతో పాటు సీపీఎంలో కూడా క్రియాశీలకంగా పనిచేశారు. ప్రకాష్‌రావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం మంగళపల్లిలో నిర్వహించారు. ప్రకాష్‌రావు భౌతికకాయానికి సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, మాజీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు నారి అవిలయ్య, కందాల ప్రమీల, బొజ్జ చినవెంకులు, మాజీ ఎంపీపీ మర్రి వెంకటయ్య, ఆలిండియా బ్‌లైండ్ డెవలప్‌మెంట్ అసోసియేషన్(డ్వాబ్) ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు, అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు నివాళులర్పించారు.
నేత్రాలు దానం..
స్థానిక లయన్స్ క్లబ్, నవ్య క్లబ్ ఆధ్వర్యంలో నల్లగొండ లయన్స్ చారిటబుల్ ట్రస్ట్, ఐ డోనేషన్ సెంటర్ డాక్టర్లు వచ్చి ప్రకాష్‌రావు నేత్రాలను సేకరించారు. ఈ క్రార్యక్రమంలో ఆయా క్లబ్‌ల అధ్యక్షులు ఎన్. సూర్యచంద్రరావు, పద్మజ తదితరులు ఉన్నారు.
వాచ్యాతండా లిఫ్టుకు రూ.25.20 లక్షలు
మిర్యాలగూడ : వాచ్యాతండా లిఫ్టు మరమ్మతులకు రూ.25.20 లక్షలు మంజూరు చేసినట్లు నీటిపారుదల శాఖ డివిజన్ 3, ఈఈ గోపయ్య తెలిపారు. మూసీ నదిపై ఏర్పాటు చేసిన వాచ్యాతండా ఎత్తిపోతల పథకం వద్ద రెండు ట్రాన్స్‌ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేసి కాపర్ వైరు, ఆయిల్ చోరీ చేశారు. జూలై 6న రైతుల ఫిర్యాదు మేరకు వాడపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై నిరుపయోగంగా వాచ్చాతండా లిఫ్టు శీర్షికన గత నెల 31న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. రెండు ట్రాన్స్‌ఫార్మర్లను మరమ్మతు చేసి లిఫ్టును నడిపించేందుకు ఈఎన్‌సీ నిధులు మంజూరు చేసినట్లు ఈఈ తెలిపారు.


