నిర్బంధాలతో ఉద్యమాలను అణచలేదు | - | Sakshi
Sakshi News home page

నిర్బంధాలతో ఉద్యమాలను అణచలేదు

Sep 17 2026 2:20 AM | Updated on Sep 17 2026 2:20 AM

భువనగిరిటౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో కార్మిక ఉద్యమాలను అణచలేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య అన్నారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని రైతు బజార్‌ వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ అంగన్‌వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం అణచివేతకు దిగడం దారుణమన్నారు. మహిళలని కూడా చూడకుండా ముందస్తు అరెస్టులు చేయడం, లాఠీచార్జీ లకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్‌ భాస్కర్‌ రావు, జిల్లా ఎస్పీ అకాంక్ష యాదవ్‌లకు వినతిపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం, నాయకులు దాసరి పాండు, ఎం.డి. పాషా, దోనూరి నర్సిరెడ్డి, మాయ కృష్ణ, తుర్కపల్లి సురేందర్‌, గొరిగే సోములు, సిలివేరు రామకుమారి, చెక్క రమేష్‌, పైళ్ళ గణపతి రెడ్డి, పొట్ట యాదమ్మ, ఆదిమూలం నందీశ్వర్‌, మంచాల మధు, తూటి వెంకటేష్‌, మారయ్య, మెంటే ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఫ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement