సాయుధ పోరాట యోధుల స్ఫూర్తిని కొనసాగిస్తాం | - | Sakshi
Sakshi News home page

సాయుధ పోరాట యోధుల స్ఫూర్తిని కొనసాగిస్తాం

Sep 17 2026 2:20 AM | Updated on Sep 17 2026 2:20 AM

మునగాల : తెలంగాణ సాయుధ రైతాంగ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తిని కొనసాగిస్తామని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి స్పష్టం చేశారు. బుధవారం ఐద్వా ఆధ్వర్యంలో మునగాల మండలం నర్సింహలగూడెంలో నిర్వహించిన పోరు వనితల స్ఫూర్తి యాత్ర బాటలో ఆమె పాల్గొని మాట్లాడారు. భూమి కోసం, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయధ పోరాటం సాగిందిన్నారు. ఈ పోరాటంలో వేలాది మంది ప్రజలు ప్రాణత్యాగం చేశారని, అనేక గ్రామాలను వెట్టిచాకిరి నుంచి విముక్తి చేశారని, ఫలితంగా లక్షలాది ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అమరవీరుల స్మారక స్థూపాల వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌. అరుణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి బుగ్గవీటి సరళ, కేఎన్‌ ఆశాలత, జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, సీఐటీయూ జిల్లా నాయకురాలు చెరుకు లక్ష్మి, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు జూలకంటి విజయలక్ష్మి, మేకనబోయిన సైదమ్మ పాల్గొన్నారు.

ఫ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మల్లు లక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement