కాలుష్య కోరల్లో మూడు గ్రామాలు | - | Sakshi
Sakshi News home page

కాలుష్య కోరల్లో మూడు గ్రామాలు

Sep 12 2026 12:42 AM | Updated on Sep 12 2026 12:42 AM

ఫిర్యాదులు అందాయి టైర్ల పరిశ్రమపై చర్యలు తీసుకోవాలి

బొమ్మలరామారం : బొమ్మలరామారం మండలంలోని రంగాపూర్‌ గ్రామ సమీపంలో ఉన్న ‘ఎన్‌అండ్‌ఎన్‌’ టైర్‌ కంపెనీ వెదజల్లుతున్న కాలుష్యంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రామానికి అర కిలోమీటర్‌ దూరంలో ఏర్పాటు చేసిన టైర్ల కంపెనీ నుంచి ప్రజారోగ్యానికి హానికరమైన కాలుష్యాన్ని విడుదల చేస్తోంది. ఈ కంపెనీని మూసేయాలని ఇటీవలే రంగాపూర్‌తో పాటు కాలుష్యం బారిన పడుతున్న పెద్ద పర్వతాపూర్‌, బొమ్మలరామారం గ్రామాల ప్రజలు అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నాలు చేసి అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఎలాంటి స్పందన లేదు.

ఆందోళనలు చేపట్టినా..

కాలుష్యాన్ని వెదజల్లుతున్న టైర్ల కంపెనీని మూసివేయాలని గతంలో ఉన్న కలెక్టర్‌ హనుమంతరావు, కాలుష్య నియంత్రణ మండలి, మండల అధికారులకు ప్రజలు ఎన్నో వినతులు సమర్పించారు. రంగాపూర్‌ గ్రామ పంచాయతీలో గతనెల 4న ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. దీనికితోడు గతనెల 11న రంగాపూర్‌, పెద్ద పర్వతాపూర్‌, బొమ్మలరామారం ప్రజలు అఖిల పక్షం ఆధ్వర్యంలో టైర్‌ల కంపెనీ ఎదుట ధర్నా, నిరసనలు చేపట్టారు. గతనెల 14న ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య సైతం టైర్ల కంపెనీని పరిశీలించి ప్రజారోగ్యానికి ముప్పు ఉందని గమనించారు. ఫ్యాక్టరీని మూసేయాలని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. కనీసం జిల్లా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు కంపెనీ వైపు కన్నెత్తి చూడడం లేదు.

జనావాసాల్లోకి కాలుష్యం

టైర్ల రీసైక్లింగ్‌ కంపెనీ నుంచి జనావాసాల్లోకి వదులుతున్న పొగతో గాలిలో కార్బన్‌ డైయాక్సడ్‌ పెరిగి ఆక్సిజన్‌ స్థాయి పడిపోయి కళ్లు మండడంతో పాటు ప్రజలు ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నారు. ఫలితంగా శ్వాస సంబంధిత సమస్యతో పాటు గుండె, ఊపిరితిత్తులు పాడవడం, జలుబు, ఎలర్జీ లాంటి అనారోగ్యం బారిన పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సమీపంలోని కూరగాయల పంటలపై నల్లటి బొగ్గులాంటి పదార్థం పేరుకుపోతుందని రైతుల వాపోతున్నారు. కంపెనీపై విచారణ జరిపి మూసివేయాలని బా ధిత గ్రామాల ప్రజల డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు రంగాపూర్‌ గ్రామ సమీపంలోని కాలుష్యం వెదజల్లుతున్నట్లు ఎన్‌అండ్‌ఎన్‌ టైర్‌ల కంపెనీపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో.. ఎన్ని రోజుల్లో అమలు చేస్తామనే వివరాలు తెలుసుకునేందుకు ఆర్‌టీఐ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

– వెంకన్న, జిల్లా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారి

యాదగిరిగుట్ట : పలు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ఉన్న బొమ్మలరామారం మండలం రంగాపూర్‌లోని టైర్ల పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అసెంబ్లీ వేదికగా కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ టైర్ల పరిశ్రమ నుంచి వెలువరించి పొగ కాలుష్యం వల్ల రంగాపూర్‌పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. టైర్ల పరిశ్రమలో తనిఖీలు చేసి, కాలుష్య నియంత్రన నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించాలన్నారు. అలాగే తుర్కపల్లి మండలంలో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేసిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఐటీ పార్క్‌ ఏర్పాటు కోసం 110 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించడం జరిగిందని తెలిపారు.

ఫ ఎన్‌అండ్‌ఎన్‌ టైర్ల కంపెనీతో కాలుష్యం

ఫ అనారోగ్యం బారిన ప్రజలు

ఫ మూసేయాలని రంగాపూర్‌ పంచాయతీ తీర్మానం

ఫ మరో రెండు గ్రామాల ప్రజలూ ఆందోళనబాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement