ఫ ఇన్‌చార్జి కలెక్టర్‌గా భాస్కర్‌రావు
సాక్షి, యాదాద్రి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శనివారం ఈనెల 28వ తేది వరకు సెలవుపై వెళ్లారు. తన వ్యక్తిగత పనులపై ఆయన సెలవులో వెళ్తున్నారు. కాగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్‌రావు పూర్తి అదనపు బాధ్యతలతో ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తారు.
చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాడాలి
భువనగిరి : చాకలి ఐలమ్మ, జెన్‌జీ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు రజనీకాంత్ అన్నారు. భువనగిరి పట్టణంలోని వెన్నెల కళాశాలలో జరుగుతున్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నూతన విద్య విధానం తేవడం పేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేయడమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మేడబోయిన మమత, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కల్లూరి మల్లేశం,ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ కార్యదర్శి వనం రాజు,రాష్ట్ర అఫీస్ బేరర్స్ దీపిక, సుమ, నాయకులు వేముల నాగరాజు,ఇందురాణి, ఈర్ల రాహుల్, పుట్టల ఉదయ్, జగన్, నేహల్, నరేందర్, కార్తీక్, ప్రసన్న పాల్గొన్నారు.
డీవైఎఫ్‌ఐ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
ఫ అధ్యక్షుడిగా కవిడే సురేష్, కార్యదర్శిగా బుర్రు అనిల్ కుమార్
భువనగిరిటౌన్, చౌటుప్పల్ : డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్‌ఐ) జిల్లా నూతన కార్యవర్గాన్ని చౌటుప్పల్‌లో నిర్వహించిన ఆ సంఘం జిల్లా 3వ మహాసభల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ సంఘం నాయకులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా అధ్యక్షుడిగా కవిడే సురేష్, కార్యదర్శిగా బుర్రు అనిల్ కుమార్, ఉపాధ్యక్షులుగా వనం రాజు, ఎండీ ఖాయం, శానుగొండ రాము, పల్లె శివ, దొంతగాని అమరేందర్, సహాయ కార్యదర్శులుగా పల్లె మధుకృష్ణ, ఎండీ సలీం, చుక్క రజినీకాంత్, మొంగాడి పృథ్వీతోపాటు మొత్తం 33మందితో కమిటీ ఎన్నికై ంది. ఇందులో 11 మందితో ఆఫీస్ బేరర్స్ కమిటీ ఏర్పాటైంది. నూతన కార్యవర్గానికి పలువురు నాయకులు అభినందనలు తెలిపారు.
జాతీయ రహదారిపై వాహనాల బారులు
చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీ య రహదారిపై శుక్రవారం వాహనాల రద్దీ ఏర్పడింది. వరుస సెలవుల నేపఽథ్యంలో ఈ రద్దీ నెలకొంది. వీకెండ్, వరుస సెలవులు, వినాయక చవితి వేడుకలు ఉండడంతో ప్రజలు వివిధ ప్రాంతాలకు ప్రయాణాలను ప్రారంభించారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు బారులుదీరాయి. విపరీతమైన రద్దీ కారణంగా వాహనాలు బంపర్ టు బంపర్‌గా ముందుకు సాగాయి. ప్రధానంగా విజయవాడ మార్గంలో రద్దీ అత్యధికంగా కొనసాగుతుంది. సాధారణ రోజులతో పోలిస్తే రద్దీ కారణంగా హైదరాబాద్ నుంచి చౌటుప్పల్‌కు చేరుకునేందుకు సుమారుగా రెండింతల సమయం పడుతోంది. ట్రాఫిక్ మూలంగా అటు వాహనదారులు, ఇటు ప్రయాణికులు నానా అవస్థలకు గురయ్యారు. పట్టణంలో రోడ్డు నిర్మాణ పనులు సాగుతుండడంతో వాహనాలు సర్వీస్ రోడ్ల మీదుగా వెళ్తున్నాయి. ఈ క్రమంలో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.


